జగన్.. ఖైదీ నెంబర్ 6093.. జస్టిస్ రాకేశ్ కుమార్ షాకింగ్‌ స్టేట్‌మెంట్..?

Chakravarthi Kalyan
జస్టిస్ రాకేశ్ కుమార్.. జగన్ సర్కారుతో జగడం పెట్టుకున్న న్యాయమూర్తుల్లో ఈయన ఒకరు. అనేక కేసుల సందర్భంగా ఈయన జగన్ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈయన ఇవాళ రిటైర్ అవుతున్నారు. సరిగ్గా రిటైర్ అయ్యే ఒక్క రోజు ముందు బాంబు పేల్చేశారు.  మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కేసు విచారణ నుంచి జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ వైదొలగాలంటూ.. ఆ సంస్థ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వేసిన పిటిషన్‌ పై తీర్పు చెబుతూ.. అనేక వ్యాఖ్యలు చేశారు.
ఈ తీర్పులో జగన్ పై ఉన్న కోపమంతా రాకేశ్ కుమార్ కక్కేశారనే చెప్పాలి.  ఈ కేసును కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో రాకేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సీజేఐకి రాసిన లేఖ ప్రచురితమయ్యే వరకు జగన్  గురించి తనకు పెద్దగా తెలియదని... ఆ లేఖ తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత పెరిగిందని... గూగుల్‌లో ఖైదీ నంబర్‌ 6093 అని కొడితే చాలా సమాచారం వస్తుందని ఎవరో చెప్పారని.. తాను అలా చేసేసరికి దిగ్భ్రాంతి కలిగించే సమాచారం లభించిందని కామెంట్ చేశారు.
తాను డౌన్‌లోడ్‌ చేసిన సమాచారాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నానని... ఆ తర్వాత కొంత సాధికారిక సమాచారం తెప్పించుకున్నానని... జగన్‌పై 11 సీబీఐ కేసులు, 6 ఈడీ కేసులు, ఐపీసీ సెక్షన్‌ కింద నమోదు చేసిన మరో 18 కేసులు ఉన్నట్టు తెలిసిందని రాకేశ్ కుమార్ అన్నారు. ఆ కేసులన్నీ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఒకరోజు వాటిలో కొన్ని తప్పుడు కేసులని, వాస్తవాల నమోదులో పొరపాటు జరిగిందని, చర్యలు నిలిపివేశామన్న కారణాలతో పోలీసులు వాటిని మూసేశారని తెలిపారు.  డీజీపీ సారథ్యంలోని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఎలా పనిచేస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనమని రాకేశ్ కుమార్ కామెంట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: