పాపం.. పవన్.. తెలిసి.. తెలిసీ.. ఆ నానీలతో ఎందుకు పెట్టుకున్నాడో..?

Chakravarthi Kalyan
నివార్ తుపానులో నష్టపోయిన రైతులకు వెంటనే రూ.10 వేల పరిహారం ఇవ్వాలంటూ పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి వినతి పత్రం అందించారు. కాకపోతే.. ఆ కార్యక్రమంలో భాగంగా తన పర్యటనలో ఏకంగా కొడాలి నాని, పేర్ని నానిలపై విమర్శలు గుప్పించడం వివాదాస్పదంగా మారింది. అసలే వైసీపీ.. అందులోనూ కొడాలి నాని.. ఇక సీన్ ఎలా ఉంటుందో తెలిసిందేగా.. అలాగే మరో మంత్రి పేర్ని నాని ఏం తక్కువ తినలేదు.. ఆయన నవ్వుతూనే వాతలు పెట్టే రకం.

వైసీపీలో కొడాలి నాని అంటే ఓ బ్రాండ్ ఉంది. ఆయన నోరు తెరిచారంటే టీడీపీ నేతలు చెవులు మూసుకోవాల్సిందే. నోటితో వాతలు పెట్టే విషయంలో కొడాలి నాని ఏమాత్రం రాజీ పడరు. అందుకే.. పవన్ కళ్యాణ్ తనకు తాను వకీల్ సాబ్ అని చెప్పుకుంటే.. కొడాలి నాని వకీల్ సాబ్ కాదు.. షకీలా సాబ్ అంటూ కౌంటర్ వేశారు. ఇక పేర్ని నాని అయితే చిడతల నాయుడు అంటూ పవన్ పరువు తీసేశారు.

పేర్ని నాని పవన్‌ను చిడతల నాయుడుగా అభివర్ణించారు. ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ పనిచేయలేదని, ఓడిపోగానే నరేంద్ర మోదీ కాళ్ల దగ్గరకు చేరారని విమర్శించారు. పవన్ ఇప్పటికే ఎందరికో చిడతలు కొట్టాడని మంత్రి  వ్యంగ్యంగా అన్నారు. ‘నేను వైఎస్‌ఆర్‌కు భక్తుడిని. నాది స్వామిభక్తి.. చచ్చిపోతూ కూడా వైఎస్‌ కుటుంబానికే భజన చేస్తా. డబ్బులు కోసం చిడతలు కొట్టే వాడిని కాదు. చిడతలు వాయిస్తూ డబ్బులు సంపాదించడం చిడతల నాయుడికే చెల్లింది. 2014లో హైటెక్స్‌లో మీటింగ్‌ పెట్టి మోదీకి చిడతలు కొట్టింది పవనే. నెల తిరక్కముందే చంద్రబాబుకు చిడతలు కొట్టారని’’ పేర్ని నాని ఎద్దేవా చేశారు.

మరో మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా పవన్ పై మండిపడ్డారు.‘చంద్రబాబు సొంత పుత్రుడు, దత్త పుత్రుడు ఇద్దరు రైతులపై కపట ప్రేమ కురిపిస్తున్నారు. సినిమా షూటింగ్ లేదు కాబట్టి పవన్ హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చారని అవంతి ఎద్దేవా చేశారు. సో.. మొత్తానికి పవన్ కల్యాణ్.. తెలిసి తెలిసి నానీలతో పెట్టుకుని నవ్వులపాలయ్యారంటున్నారు వైసీపీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: