ఓలా సంస్థ సంచలనం నిర్ణయం... అతి పెద్ద బైక్ తయారీ పరిశ్రమ ఏర్పాటు...?

VAMSI
పరుగెడుతున్న కాలంతో పాటు మనము ముందుకు సాగాలంటే కావలసిన వసతులలో రవాణా సౌకర్యం కూడా ఒకటి. ప్రస్తుతం ఉన్న సమాజంలో వాహనాలు వినియోగించే వారు సగం కంటే ఎక్కువ మందే ఉన్నారనే చెప్పాలి. అందులోనూ ద్విచక్ర వాహనం ఎంతో సౌకర్యవంతంగానూ... మిగిలిన వాహనాలతో పోలిస్తే కాస్త చౌక గా లభిస్తుంది. అందుకే ఎక్కువ శాతం మంది ద్విచక్ర వాహనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.
కానీ వాహనాలను అధికంగా ఉపయోగించడం వలన వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఓ పక్క ప్రభుత్వాలు పర్యావరణాన్ని సంరక్షించండి... వాహనాలు వీలైనంత తక్కువగా వాడండి, వాకబుల్ డిస్టెన్స్ అయితే నడిచి వెళ్లడం మరింత ఉత్తమం చెబుతూనే ఉన్నారు. పబ్లిక్ వాహనాలను వినియోగించడం మంచిది అని చెబుతున్నా జరిగేవి ఎలాగో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా పెట్రోల్ కు బదులు విద్యుత్ నింపుకొని నడిపే బండ్లను తయారు చేస్తోంది  ఒక సంస్థ. దీనివల్ల వాయు కాలుష్యం తగ్గి ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా అత్యాధునిక ఫ్యూచర్స్ తో ఈ వాహనం మరింత ఆకట్టుకుంటోంది.
ప్రపంచం లోనే మొదటి సారిగా అతిపెద్ద విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ పరిశ్రమను భారత్‏లో నిర్మించనున్నట్లు ఓలా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా  తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూ  సిద్ధం చేసుకుంది ఈ సంస్థ. ఇక్కడ తయారయ్యే బైకులు అత్యాధునిక ఫ్యూచర్స్ తో వాహన దారులను ఆకట్టుకోనున్నాయి. ప్రతి ఏడు ఈ కర్మాగారంలో 20 లక్షల వరకు ద్విచక్ర వాహనాలను తయారు చేయనుందని.. ఇది మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద బైక్ తయారి సంస్థగా పేరుపొందనుందని  ఓలా తెలిపింది. తమిళనాడులో ఈ పరిశ్రమ నిర్మిస్తే పదివేలకు పైగా కార్మికులకు ఉపాధి లభించనుంది. ఈ వార్త విని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ పరిశ్రమ  కార్యరూపం ఎప్పుడు జరుగుతుందో పూర్తి వివరాలు త్వరలోనే ఓలా సంస్థ తెలియ చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: