బిగ్ బాస్ 4 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే.. ఫాన్స్ బారి షాక్..?

praveen
ప్రస్తుతం తెలుగు బుల్లితెర ప్రేక్షకులు  అందరిని తనదైన శైలిలో అలరిస్తూ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. నాగార్జున తన చరిష్మా తో బిగ్ బాస్ షో నీ అత్యధిక రేటింగ్ తో ప్రస్తుతం ముందుకు తీసుకెళ్తున్నారు అనే విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ లో టాప్ షో గా  దూసుకుపోతున్న బిగ్బాస్ నిన్నటితో 13 వారాలు పూర్తి చేసుకుంది అనే విషయం తెలిసిందే. 14వ వారం లోకి అడుగుపెట్టింది. అంటే ఇప్పటివరకు బిగ్బాస్ మొదలై అప్పుడే 91 రోజులు పూర్తి అయిపోయింది.  ఇక మరో రెండు వారాల్లో బిగ్ బాస్ షో  కి తెర పడిపోతుంది అన్న విషయం తెలిసినదే. ఇప్పటికే ఫైనల్ అంకానికి చేరుకున్న బిగ్బాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.

 ప్రతి బిగ్బాస్ మొదటి సీజన్ నుంచి మూడవ సీజన్ వరకు కూడా బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ గా మెయిల్ కంటెస్టెంట్స్ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ  బిగ్బాస్ సీజన్ లో విజేత గా ఫిమేల్ కంటెస్టెంట్ నిలిచే అవకాశాలు ఉన్నాయి అనే టాక్ ప్రస్తుతం వినిపిస్తోంది.  కాగా  ఇంట్లో ఏడుగురు సభ్యులు ఉండడంతో 12 వ వారం ఎలిమినేషన్ లేకుండానే బిగ్ బాస్ షో ముగిసింది అన్న విషయం తెలిసిందే.  అయితే మిగతా రోజులు ఎలా ఉన్నప్పటికీ నామినేషన్ సమయంలో మాత్రం ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటూ బురద జల్లుకోవడం మాత్రం బిగ్ బాస్ హౌస్ లో కామన్ గా మారిపోయింది.

 ఇప్పటికే బిగ్ బాస్ కి ఇచ్చిన అన్ని టాస్కులను  సమర్థవంతంగా పూర్తిచేసిన అఖిల్ బిగ్బాస్ నాలుగవ సీజన్లో ఫైనల్కు చేరిన తొలి కంటెస్టెంట్ గా రికార్డు సృష్టించాడు.  ఇప్పటికే నామినేషన్ లో ఉన్న అఖిల్ సేవ్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత హారిక మోనాల్ అవినాష్ అభిజిత్ ఇంకా నామినేషన్ లో  మిగిలి ఉన్నారు. అయితే ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.  అయితేఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి జబర్దస్త్ అవినాష్ ఎలిమినేట్ అయ్యారు.  గత వారం ఎలిమినేట్ అవ్వాల్సి ఉన్నప్పటికీ ఏవిక్షన్  ఫ్రీ పాస్ ఉన్నందున ఎలిమినేషన్ నుంచి బయటపడిన అవినాష్ ఈసారి మాత్రం ఎలిమినేట్ అయ్యి  బయటికి వెళ్లడం పక్క టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: