ప్రేమ జంటపై చంఢీగఢ్ పోలీసుల ప్రతాపం..వైరల్ అవుతున్న వీడియో..

Satvika
ప్రస్తుతం దేశంలో ప్రేమ అనే పదానికి పెద్దలు వ్యతిరేఖంగా మారారు.. కులాలు, మతాలు వేరు అనే ఒక అంశం వల్ల ప్రేమికులను విడగొడుతున్నారు.. ఒకవేళ ఎదురించి పెళ్లి చేసుకుంటే వారికి చావును పరిచయం చేస్తున్నారు. ప్రేమించుకున్న ఓ జంట పెళ్లికి నో చెప్పడంతో పారిపోయి పెళ్లి చేసుకోవాలని వెళ్ళారు. అయితే వారిని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు..ఈ ఘటన చంఢీగఢ్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. 



ముస్లిం మతానికి చెందిన ఓ యువకుడు మరో మతానికి చెందిన ఓ యువతిని కోర్టులో పెళ్లి చేసుకునేందుకు వెళ్లగా చంఢీగఢ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ యువతిని బలవంతంగా తన ఆధీనంలో ఉంచుకున్నాడన్న ఆరోపణలపై అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కోర్టు దగ్గర నుంచి ఆ యువకుడిని లాక్కెళ్ళిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అతనితో పాటు ఉన్న ఆ యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గత కొన్నేళ్లుగా వారిద్దరూ కలిసి తిరుగుతున్నారు. అయితే ఆమెను బంధించి పెళ్లి చేసుకోవాలని చూసాడాని ఆరోపించారు. మతాన్ని మార్చి పెళ్లి చేసుకోవాలని చూసాడు.. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. 


కాగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యాంటీ లవ్ జిహాద్ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.బలవంతపు మతమార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్- 2020 పేరుతో చట్టాన్ని తీసుకొచ్చింది..బలవంతంగా మతాన్ని మార్పిడి చేస్తే పదేళ్లు జైలు శిక్ష తో పాటు భారీ మూల్యాన్ని చెల్లించాలని ఆయా ప్రభుత్వం వెల్లడించింది.కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించే పథకాన్ని కూడా రద్దు చేసే యోచనలో యోగి సర్కార్ ఉన్నది.ఈ స్కీమ్ కింద.. మతాంతర వివాహం చేసుకున్న వారికి రూ.50వేలు నగదు ప్రోత్సాహం అందిస్తారు.ఇందుకోసం ఆ జంట పెళ్లి జరిగిన రెండేళ్లలోపు జిల్లా మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత నగదు కూడా అందుతుందని వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: