హంగ్ తో టీ ఆర్ ఎస్ కు బెంగ పట్టుకుందా...ఎంఐఎం కొండకెక్కుతుందా..?

P.Nishanth Kumar
అనుకున్నట్లుగానే అయ్యింది.. గ్రేటర్ లో బీజేపీ మరోసారి తన దూకుడు ప్రదర్శించింది.. టీ ఆర్ ఎస్ జోరు తగ్గిపోయింది.  ప్రచారంలో చూపించిన దూకుడు ను టీ ఆర్ ఎస్ పార్టీ ఫలితాల్లో చూపించలేకపోయింది.. ఫలితం బీజేపీ కే నాలుగు నుంచి 49 సీట్లు పెరిగేలా చేసింది.. టీ ఆర్ ఎస్  99 నుంచి 56 సీట్లకే పరిమితం అయ్యేలా చేసుకుంది. నిజంగా ఇదొక విప్లవం.. ప్రజల నిరసన..అధికార పార్టీ పై వారికున్న వ్యతిరేకత ను ఈ విధంగా చూపించి బీజేపీ ని గెలిపించే ప్రయత్నం చేశారు.. కేవలం 7 సీట్ల తేడాతో బీజేపీ టీ ఆర్ ఎస్ కన్నా వెనుకబడి ఉంది..
ఇదే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. బీజేపీ నేతలు దీన్ని గెలుపుగానే భావిస్తున్నారు..అందుకే జోరుగా సంబరాలు చేసుకుంటున్నారు.. నిన్న బీజేపీ భవన్ లో సంబరాలు మిన్నంటాయి.. ఇక ఈ ఫలితాలు ఎవరు గ్రేటర్ లో అధికారం చేపడతారో అన్నది ఆసక్తి కరంగా మారింది.. కాంగ్రెస్ పార్టీ కి రెండు సీట్లు రాగ, మిగితా పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కలేదు.. మొత్తానికి ఈ ఎన్నికల్లో హ్యాంగ్ రావడంతో ఎంఐఎం ఎలాంటి గొంతెమ్మ కోరికలు కోరుతుందో అని తెరాస నేతల్లో టెన్షన్ పట్టుకుంది..
అయితే హంగ్‌ ఏర్పడినా పాలక మండలిని ఏర్పాటు చేసే అవకాశం టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉంది. ఆ పార్టీ ఎంఐఎంతో కలసి జీహెచ్‌ఎంసీ పాలన చేపట్టాల్సిన తప్పని పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసే.. ఎక్స్‌ అఫిషియో సభ్యులతో సంబంధం లేకుండా పాలక మండలి ఏర్పాటవుతుంది. మేజిక్‌ ఫిగర్‌ 98 కాగా.. టీఆర్‌ఎస్‌ 56, ఎంఐఎం 43.. వెరసి ఆ రెండు పార్టీల బలం 99కు చేరుతుంది. తుది ఫలితాల తర్వాత ఒకట్రెండు రోజులకు రాష్ట్ర ఎన్నికల సంఘం మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. ఈ లోపు ఆ రెండు పార్టీలు ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: