రోజుకి 110 రూ.లు ఆదా చేస్తే.. 27 లక్షలు చేతికి.. అదిరిపోయే పాలసీ అందుబాటులో..?
ఎన్నో రకాల పాలసీలను అందించి తమ కస్టమర్లకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు ఎంతో మంది తల్లిదండ్రులకు తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు ధీమా కల్పించే విధంగా పాలసీలను అందుబాటులో ఉంచుతుంది. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందిస్తున్న పాలసీలలో కన్యాదానం పాలసీ ఒకటి. అయితే ఎల్ ఐ సి జీవన్ లక్ష్య పాలసీ కన్యాదానం పాలసీ గా చెప్పుకుంటారు. ఈ పాలసీ తీసుకోవడం ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో బెనిఫిట్స్ లభిస్తాయి. ప్రతిరోజు 110 రూపాయలు ఆదా చేస్తే చాలు.. మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 27 లక్షల వరకు పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రీమియం చెల్లించి మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ ఆదాయం పొందాలనుకునే వారికి ఈ ప్లాన్ ఎంతో అనువుగా ఉంటుంది.
18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ పాలు తీసుకోవాలనుకునే వారు ఒక విషయాన్ని తప్పక గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. పాలసీ టర్మ్ 25 ఏళ్లు ఉంటుంది అయితే మీరు 22 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఒక వేళ పాలసీదారుడు మరణిస్తే ఇక ప్రీమియం మొత్తం చెల్లించాల్సిన పని లేదు. అంతేకాకుండా నామినీకి ప్రతి ఏడాది పాలసీ మొత్తంలో 10 శాతం డబ్బులు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ సమయంలో భీమా మొత్తంతో పాటు బోనస్ లాంటివి కూడా లభిస్తాయి ఉదాహరణకు 10 లక్షల బీమా మొత్తానికి 18 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ సమయంలో 27 లక్షలు వస్తాయి. ఇక ప్రతి నెలా ప్రీమియం 3300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.