గ్రేటర్ యుద్ధం : అభ్యర్థులను పరేషాన్ లో పడేసిన ఓటర్లు..?
ఇక ప్రచార హోరు ముగిసి ఎట్టకేలకు నిన్న జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు ప్రచారం నిర్వహించి ఓటర్ల అందరిని విచిత్రమైన హామీలతో పరేషాన్ లో పడేసిన అభ్యర్థులను పోలింగ్ సమయంలో పరేషాన్ లో పడేశారు ఓటర్లు. అసలు గడప దాటి కాలు బయట పెట్టడానికి కూడా ఆసక్తి చూపలేదు. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ కాస్త వెలవెలబోయింది. నగరం నడిబొడ్డులో ఉన్న వారు కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. అతి తక్కువ శాతం ఓటింగ్ నమోదు కావడం గమనార్హం.
ఇక నిన్న నమోదైన ఓటింగ్ శాతాన్ని చూసి అటు అభ్యర్థులే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.హైదరాబాద్ నగరంలో. ఈ క్రమంలోనే తక్కువ శాతం ఓటింగ్ తో ప్రస్తుతం అభ్యర్థులందరూ పరేషాన్ లో పడిపోయారు. ఎక్కువ ఓట్లు వస్తే ఎక్కువ మెజారిటీ సాధించేందుకు అవకాశం ఉంటుందని కాని అసలు ఓట్లు రాకపోతే గెలుపు ఓటములు తేల్చేది చాలా కష్టంగా మారుతుంది అని ప్రస్తుతం అభ్యర్థులు ఆందోళన మునిగిపోతున్నారు. అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఏం జరుగుతుందో అని ప్రస్తుతం టెన్షన్లో మునిగిపోతున్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు.