గ్రేటర్ యుద్ధం : వేడి పుట్టిస్తున్న కరోనా వాక్సిన్ ?

గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఉదృతంగా ప్రచారం చేస్తూ, ప్రజలను తమ వైపు తిప్పుకుని ఓట్ల రూపంలో వారి మద్దతు కూడగట్టి ,గ్రేటర్ లో పాగా వేయాలని, తద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ జండా ఎగురవేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాజకీయ పార్టీలు ప్రజల మద్దతు పొందేందుకు వారికి ఎన్నో రకాల హామీలను ఇస్తున్నాయి. ఆ హామీలు సాధ్యమా కాద అనేది పక్కన పెడితే, ఒక పార్టీ నుంచి మరో పార్టీ ఉచిత వరాలను ప్రకటిస్తూ తమ గెలుపు డోకా లేకుండా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.



 ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశాయి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల రేంజ్ లో గ్రేటర్ హామీలను ఇస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కాలం కావడం, ప్రజలందరూ ఈ వైరస్ మహమ్మారి ప్రభావానికి భయ పడుతూ ఉండడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుందనే వార్తల నేపథ్యంలో అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ కనుక అందుబాటులోకి వస్తే ఎంత దూరం ఉంటుంది ? ప్రభుత్వాలు ఉచితంగా సరఫరా చేస్తాయి లేదా ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. దీంతో రాజకీయ పార్టీలు సైతం ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వ్యవహారంపై దృష్టి పెట్టాయి గ్రేటర్ లో ఈనెల 28వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అదే రోజున ప్రధాని నరేంద్ర మోడీ సైతం హైదరాబాద్ కు వస్తున్నారు. 



భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కోవా గ్జిన్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న విధానం, వాటి డెవలప్మెంట్ పరిశీలించేందుకు ఆయన హైదరాబాద్ కు అదే రోజు మూడు గంటల 40 నిమిషాలకు వస్తారని, భారత్ బయోటెక్ సంస్థ కార్యాలయానికి వెళ్లి అక్కడ వ్యాక్సిన్ పురోగతిని పరిశీలిస్తారని తెలుస్తోంది. అయితే ఆయన రాక వెనుక రాజకీయం ఉందని వ్యాక్సిన్ వ్యవహారాన్ని హైలెట్ చేసి , ప్రజల్లో దానిపై చర్చ జరిగేలా చేసి బిజెపి వైపు మొగ్గు ఉండేలా చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: