కేసీఆర్ అలా చేస్తున్నాడంటే బీజేపీ గెలిచినట్లే మరీ..?

P.Nishanth Kumar
తెలంగాణ రాష్ట్రంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కేసీఆర్ కి దుబ్బాక ఉప ఎన్నిక బ్రేక్ వేసింది.. ఇక్కడ బీజేపీ అనూహ్యంగా విజయం సాధించి టీ ఆర్ ఎస్ కి పెద్ద షాక్ ఇచ్చింది.. ముందు నుంచి ఇక్కడ గులాబీ పార్టీ దే విజయం అనుకున్నారు అంతా కానీ రఘు నందన్ రెడ్డి ని  స్వల్ప మెజారితో గెలిచారు.. రాష్ట్రంలో రాజకీయ చాణక్యుడు గా కేసీఆర్ కి మంచి పేరుంది. అయన వ్యూహం రచిస్తే ఎంతటి ఎన్నికల్లో అయినా పార్టీ గెలవక తప్పదు.. అయితే తొలిసారి రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగింది.. దుబ్బాక లో ఓడిపోవడం కేసీఆర్ కి ఒకవిధంగా అవమానం లాంటిదే..
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారాన్ని చూస్తే.. బీజేపీ వ్యూహకర్తల తెలివిని మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే.. కేసీఆర్ రాజకీయం ఎప్పుడూ తనదే పైచేయి ఉండేలా చేయటమే కాదు.. భావోద్వేగంతో ఎజెండాను ఫిక్స్ చేస్తుంటారు. దీనికి తగ్గట్లే ఆయన ఇప్పటికే ఫలితాన్ని పొందారు. అయితే కేసీఆర్ నే ఫాలో అవుతూ బీజేపీ పార్టీ చేయడం వారికి గెలుపుకు కీలక మైంది.
దుబ్బాక లో ఆ ప్రయోగం సక్సెస్ కావడంతో గ్రేటర్ లోనూ బీజేపీ అదే రూట్లో ప్రయాణిస్తోంది. భావోద్వేగ అంశాల్ని ప్రస్తావిస్తూ.. వాటిపై తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితిని తీసుకొస్తోంది. వరదాలని కీలకంగా చేసుకుని పలు అంశాలను ప్రశ్నలు గా కేసీఆర్ కి సంధిస్తూ సమాధానం చెప్పాల్సింది గా బీజేపీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.. దాంతో తెలియకుండానే కేసీఆర్.. కేటీఆర్ లు సమాధానాలు ఇవ్వటం కనిపిస్తుంది. ఎన్నికల ఎజెండాను.. ప్రచార ఎజెండా మొత్తం బీజేపీ కోరుకున్నట్లే జరుగుతున్నట్లు. మరీ.. విషయాన్ని పెద్ద సారు ఎందుకు పట్టించుకోవటం లేదు? అన్నది ప్రశ్న. ఏమైనా.. కేసీఆర్ ను తమ వ్యూహంలో భాగస్వామ్యం చేయటం ద్వారా ఒకింత అధిక్యతను అయితే బీజేపీ ప్రదర్శిస్తుందని చెప్పక తప్పదు. మరీ.. విషయాన్ని గుర్తించి.. తానే ఎజెండాను డిసైడ్ పరిస్థితిని కేసీఆర్ ఎప్పటికి తీసుకొస్తారో..   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: