ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు.. ధర తెలిస్తే అవాక్కవుతారు..?
అలా సువాసనతో కలర్ ఫుల్ గా ఉంటేనే ఎక్కువగా అటు జనాలు కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే పైన ఫోటోలు చూసిన సబ్బు ఎలా ఉందో చూడండి.. చూడ డానికి అంత గా కలర్ ఫుల్ గా లేదు.. ఈ సబ్బు ఎవరైనా కొంటారా అంటే ఎవరైనా అనుమాన పడతారూ కానీ సబ్బు గురించి తెలిస్తే మాత్రం పోటీ పడి మరీ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు ఎంతోమంది. ఇక సాధారణంగా అయితే రెగ్యులర్గా వాడే ఒక సోప్ ధర వంద రూపాయల లోపే ఉంటుంది. ఇక్కడ పైన చూస్తున్న సోప్ ధర మాత్రం ఏకంగా 2.07 లక్షలు. ఏంటి ఆశ్చర్య పోయారు కదా కానీ ఇది మాత్రం నిజంగా నిజమే.
ఇంతకీ ఈ సబ్బుకు అంతలా ధర ఉండడానికి గల కారణం ఏమిటి అని అంటారా.. ఇందులో 17 గ్రాముల మేలిమి బంగారం కొన్ని గ్రాముల వజ్రాలు పొడి కలిపి ఈ సబ్బులు తయారు చేస్తారట. బడేర్ హాసన్ అండ్ సన్స్ వాళ్ళు ఈ సోప్ తయారు చేస్తారట. దీనితోపాటు ఆలివ్ ఆయిల్, ఆర్గానిక్ తేనె, ఖర్జూరం లాంటివి కూడా ఈ సబ్బు తయారీలో ఉపయోగిస్తారు. అయితే ఈ సంస్థ ఖరీదైన సబ్బులు తయారు చేయడంలో ఎంతగానో పేరెన్నికగన్నది. అయితే ఇది కేవలం ఆయా సంస్థ కు ఆర్డర్ ఇచ్చిన వారికి మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలు ఉంటుందా లేదా అందరూ కొనుగోలు చేయవచ్చా అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఏదేమైనా ఈ సబ్బు మాత్రం ప్రపంచంలోనే ఎంతో ఖరీదైనది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.