బండి సంజయ్ హీరోని చేస్తున్న టిఆర్ఎస్.. ఎలాగో తెలుసా..?

praveen
గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ టాపిక్ గా మారిపోయారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కనిపిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉన్నారు బండి సంజయ్. అయితే  దుబ్బాక ఉప ఎన్నికల నాటి నుంచి అయితే బండి సంజయ్ టాపిక్ మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే బండి సంజయ్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హీరోగా మారడానికి కారణం.. కెసిఆర్ అని అంటున్నారు విశ్లేషకులు.

 ఉప ఎన్నికల నాటి నుంచి అటు కెసిఆర్ కేటీఆర్ సహా టిఆర్ఎస్ నేతలు అందరూ కూడా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ ఎన్నో విమర్శలు చేయడంతో ప్రస్తుతం బండి సంజయ్ ని  ప్రజల్లో  హీరోగా మారిపోతున్నాడు. ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ వరద సహాయాన్ని  ఆపేయాలి అంటూ లేఖ రాసినట్టుగా ఫేక్ లేక సృష్టించడం అంతేకాకుండా బండి సంజయ్ పేరుతో ఎన్నో ఫేక్ పోస్ట్ లు పెట్టడం లాంటివి కూడా తెరమీదికి వస్తుండటం బండి సంజయ్ ని  మరింత హీరోగా మారుస్తున్నాయి


 ఇక ఇప్పుడు సరికొత్త ప్రచారానికి తెర మీదికి తెచ్చినట్లు  తెలుస్తోంది. బండి సంజయ్ నాయకత్వంపై బీజేపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారని అందుకే బండి సంజయ్ ను  నాయకత్వం నుంచి తొలగించేందుకు సిద్ధమవుతున్నారని.. ఏకంగా సంజయ్  పార్టీ ఇచ్చిన డబ్బులతో భారీగా భూములు కొనుగోలు చేశారు అంటూ ఆరోపణలు మొదలుపెట్టింది. ఇక టిఆర్ఎస్ చేస్తున్న ఈ ఆరోపణలని బండి సంజయ్ ని  క్రమక్రమంగా హీరోని చేస్తున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. తమ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్ళకుండా సంజయ్  ని టార్గెట్ చేసి విమర్శలు చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయి బండి సంజయ్ హీరోగా మారిపోతున్నాడని  విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: