ఓడిపోయిన.. చైనాను వదలని ట్రంప్..!

praveen
ప్రస్తుతం ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతి శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదగాలని చైనా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది చేస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికాలో గత అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించి పాలన  చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ చైనా పై విరుచుకుపడుతూ  తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశారు. చైనా చేసిన ప్రతి పనిని కూడా తప్పుబడుతూ ప్రపంచ దేశాల ముందు చైనాను ఒక దోషిగా నిలబెట్టేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు. ట్రంపు వ్యవహారంతో చైనా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అదే సమయంలో కరోనా  వైరస్ వెలుగులోకి రావడంతో కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టించడానికి కారణం చైనా అని నిరూపించడానికి ఎన్నో సాహసాలు కూడా చేశాడు. ఇక ట్రంప్ అధికారంలో ఉన్నన్ని రోజులు చైనాకు ఎన్నో ఎదురు దెబ్బలు తగలడంతో పాటు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది చైనా. అయితే ఇటీవలే అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కు ఓటమి పాలవగా జో బైడెన్  తిరుగులేని విజయాన్ని సాధించారు. జో బైడెన్   వచ్చిన తర్వాత చైనాతో శత్రుత్వం కాకుండా మిత్రుత్వం పెంచుకుంటారు అని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితిలో మాత్రం ఎక్కడ మార్పు రావడం లేదు.

 ట్రంప్  ఓడిపోయినప్పటికీ ఇప్పటికే అమెరికాను వదలడం లేదు. ఇటీవలే టిబెట్ కు ఒక స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు ట్రంపు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది అన్న విషయం తెలిసిందే. టిబెట్ లో  మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని అమెరికా ఆరోపించింది. ఇటీవలే టిబెట్ లో గతంలో తొలగించబడిన అటువంటి అధ్యక్షుడు లోగో సాంగ్ సంగాయ్  ఇటీవలే వైట్ హౌస్ లో  ప్రత్యక్షమవడం సంచలనంగా మారిపోయింది. ఇలా ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో టిబెట్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది అన్నది ఈ ఘటనతో అర్థం అవుతుంది అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: