కేసీఆర్ ప్రచారం... కేటిఆర్ సూచనలు...!

Gullapally Rajesh
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సీఎం కేసీఆర్ కూడా ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఆయన ఎప్పుడు ప్రచారం చేస్తారు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే బిజెపిని ఎదుర్కోవాలి అంటే కచ్చితంగా సీఎం కేసీఆర్ ప్రచారం చేయాల్సిన అవసరం అనేది ఉంది అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
కాబట్టి సీఎం కేసీఆర్ ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది అయితే ఆయన ప్రచారం చేసే విషయంలో ఇప్పుడు మంత్రి కేటీఆర్ కొన్ని సూచనలు చేస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా బిజెపి బలంగా ఉన్న ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రచారం చేస్తే బాగుంటుంది అనే భావనను వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా బిజెపి గతంలో గెలిచిన స్థానాలలో సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తే బాగుంటుంది అని మంత్రి కేటీఆర్ సూచిస్తున్నారు. అంతే కాకుండా బిజెపిని ఇబ్బంది పెట్టాలి అంటే కొన్ని వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ చేయాల్సిన అవసరం అనేది ఉంది అని మంత్రి కేటీఆర్ అభిప్రాయ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వద్ద కొన్ని ప్రతిపాదనలు కూడా మంత్రి కేటీఆర్ ఉంచినట్టుగా రాజకీయ వర్గాలకు సమాచారం అందింది. త్వరలోనే ఈ ప్రచారం మొదలు పెట్టనున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలతో కూడా సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. ఆయనతో పాటు ఎవరెవరు ప్రచారం లో పాల్గొనాలి ఏంటి అనే దానిపై కూడా చర్చించినట్లు సమాచారం. అయితే కేసీఆర్ ఇప్పుడు పాదయాత్రతో కూడా ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: