కరోనా పేషెంట్ ని కూడా వదల్లేదు.. లిఫ్ట్ లోకి ఎక్కించి..?
కరోనా వైరస్ బారిన పడిన మహిళలు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరగా.. సదరు మహిళపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన దారుణ ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లాలో చోటు చేసుకుంది. కరోనాతో బాధపడుతూ ఓ మహిళ ఆస్పత్రిలో చేరింది.. డాక్టర్ను కల్పిస్తాం అంటూ సదరు మహిళలతో నమ్మించాడు ఆస్పత్రిలో పనిచేసే అశ్విన్ అనే వ్యక్తి. ఇక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుండగా లిఫ్టులో ఎక్కించాడు. ఇక నాలుగో అంతస్తు కి చేరుకోగానే సదరు మహిళను బలవంతంగా లిఫ్టు లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. అటు వెంటనే సదరు మహిళ పై అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించాడు అశ్విన్.
సదరు మహిళ ఒక్కసారిగా అప్రమత్తమై ప్రతిఘటించింది. దీంతో ఆ కామాంధుడి నుంచి తప్పించుకుని ఈ విషయాన్ని అక్కడే ఉన్న మిగతా పేషెంట్లు ఆసుపత్రి సిబ్బంది చెప్పింది దీంతో పలువురు పేషెంట్లు ఆసుపత్రి రిసెప్షన్ లో అశ్విన్ ను నిలదీశారు. అదే సమయంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అశ్విన్ ను అరెస్టు చేశారు. ఇక మరోవైపు అశ్విన్ ను సస్పెండ్ చేసినట్లు అటు ఆసుపత్రి యాజమాన్యం కూడా తెలిపింది. కాగా ఇలా కేరళ లో కరోనా పేషెంట్లపై లైంగిక వేధింపులకు గురి కావడం ఇది రెండోసారి. నిందితుడిపై సరైన చర్యలు తీసుకుంటామని అటు పోలీసులు కూడా బాధితురాలికి హామీ ఇచ్చారు.