సరిహద్దుల్లో బ్రహ్మోస్ లాంచర్స్ రెడీ.. పాక్ లో వణుకు..?

praveen
మొన్నటి వరకు భారత్-చైనా సరిహద్దు లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో చైనా విస్తరణ వాదంతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడంతో భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఇక ఇప్పుడు అంతకుమించి అనే రేంజ్ లో పాకిస్తాన్ భారత్ మధ్య సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇటీవలే సరిహద్దుల్లో పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడి భారత సైనికుల పై కాల్పులు జరపడంతో ఏకంగా ఐదు మంది సైనికులు వీర మరణం పొందారు. ఈ ఘటనను తీవ్రంగా భావించిన భారత సైన్యం  పాకిస్తాన్పై ఎడతెరిపి లేకుండా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

 ఇక భారత దాడిలో భారీగా ప్రాణ నష్టం కూడా జరిగింది అన్న సమాచారం అందుతుంది. ఏకంగా పాకిస్తాన్ సరిహద్దు లోకి  ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లి మరి భారత సైన్యం దాడులకు పాల్పడటం అదే సమయంలో ఏకంగా మిస్సైల్స్  ఉపయోగించడం కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది  ఈ క్రమంలోనే ప్రస్తుతం పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి  అటు పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులను కూడా మోహరిస్తుందని ప్రచారం ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అటు భారత్ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది.


 ఇటీవలే భారత రక్షణరంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసిన బహ్మోస్  మిస్సైల్ ను  భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో మొహరించేందుకు భారత రక్షణ శాఖ సిద్ధమైనట్లు ప్రస్తుతం సమాచారం అందుతోంది. భారత్-పాక్ సరిహద్దుల్లో బ్రహ్మోస్ మిస్సైల్ కు సంబంధించిన లాంచ్ పాడ్స్  ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ధ్రువీకరణ జరగలేదు కానీ.. ప్రస్తుతం సరిహద్దుల్లో భారత ఆర్మీ ప్లాన్ మాత్రం ఎంతో  వ్యూహాత్మకంగా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సరిహద్దులో పరిస్థితి రానున్న రోజుల్లో మరింత ఉద్రిక్తంగా మారిన అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: