చివరిగా సెల్ఫీ తీసుకొని చనిపోయారు.. అసలేం జరిగిందంటే..?

praveen
మృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం కొంతమంది ఏకంగా మృత్యువును చేజేతులారా తెచ్చుకున్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా సెల్ఫీ సరదా ఈ మధ్యకాలంలో ఎంతోమంది ప్రాణాలు తీస్తున్న విషయం తెలిసిందే. సెల్ఫీ తీసుకోవాలని ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లడం ఇక ప్రమాదవశాత్తు అక్కడ ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో తెరమీదకు వచ్చాయి. ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లి సెల్ఫీలు తీసుకోకూడదు అని అటు పోలీసులు ఎన్ని అవగాహన చర్యలు చేపట్టినప్పటికీ నేటి తరం యువతలో  మాత్రం ఎక్కడ మార్పు రావడం లేదు.


 దీంతో సెల్ఫీ సరదా తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు రోజురోజుకూ తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సెల్ఫీ తీసుకోవడం ట్రెండింగ్ గా మారింది అన్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆ ప్రదేశాన్ని చూపుతూ ఒక సెల్ఫీ క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గొప్ప గా భావిస్తూ ఉన్నారు నేటి తరంలో యువత. అంతే కాదు కాస్త లైకులు ఎక్కువగా రావడానికి ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. దీంతో లైక్ ల మాట అటుంచితే ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతోమంది. కుటుంబాల్లో  తీరని విషాదం నింపుతున్నారు.

 ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. సెల్ఫీ సరదా తో ఇద్దరు యువకులు  కానరాని లోకాలకు వెళ్లిపోయారు. మెదక్ జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది కల్హేర్ మండలానికి చెందిన శివ సుమేర్ అనే ఇద్దరు యువకులు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి... నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ఇక 16వ క్లస్టర్ దగ్గర సెల్ఫీ తీసుకునేందుకు ఇద్దరు యువకులు వెళ్లగా ప్రమాదవశాత్తు జారిపడి చివరికి మృతి చెందినట్లు మిగతా స్నేహితులు తెలిపారు. ఇక చేతికొచ్చిన కొడుకు విగతజీవిగా మారిపోవడంతో  తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: