సుజనా ని అడ్డుకున్నది ఎవరు..? బ్యాంకులా..వైసీపీ నాయకులా..?
దాంతో టీడీపీ లో తనకున్న ఫేమ్ తో బీజేపీ లో ముఖ్యమంత్రి ప్లేస్ కి వెళ్లాలన్న ఉద్దేశ్యంతో పార్టీ లోని ఇతర నేతలను తొక్కేసే విధంగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని వార్తలు వినిపిస్తుండగా సుజనా ఆటలను సోము వీర్రాజు సాగనీయడం లేదని అంటున్నారు.. ఇదిలా ఉంటే సుజనా కి రాజకీయం తో పాటే ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి.. ఆ వ్యాపారాలకోసం కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులనుంచి అప్పుగా తెచ్చారు అయితే ఇటీవలే అయన అమెరికా కి వెళ్లాలని ఎయిర్ పోర్ట్ కి వెళితే అక్కడ ఆయనకు చేదు అనుభవం మిగిల్చింది.. బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆయనపై లుక్ అవుట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో అమెరికా వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించలేదు. సుజనాను ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి పంపేశారు.
ఊహించని పరిణామంతో ఖంగుతిన్న సుజనా చౌదరి కోర్టుకు ఎక్కారు. అమెరికా వెళ్లనీయకుండా తనను ఢిల్లీ ఎయిర్‌పోర్టు «అధికారులు అక్రమంగా అడ్డుకున్నారంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే వారు ఇలా ప్రవర్తిచారని సుజనా చౌదరి తన పిటిషన్‌లో ఆరోపించారు. ఇక సుజనాను అమెరికా వెళ్లకుండా అడ్డుకున్నారనే విషయం.. ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడంతో వెలుగులోకి వచ్చింది.