చైనా శాంతి మంత్రం.. కానీ తెర వెనుక ఇంత కుట్ర ఉందా..?
ఇక అనుకున్నట్లుగానే అమెరికా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయాన్ని సాధించారు. మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయినప్పటికీ చైనా మాత్రం మునపటిలా దూకుడుగా వ్యవహరించడం లేదు. ఇప్పటికి కూడా శాంతి వచనాలు వల్లిస్తూ ఉంది చైనా. దీని వెనుక పెద్ద కారణమే ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.
ప్రస్తుతం యుద్ధం చేసే పరిస్థితి చైనాకు లేదని ఎందుకంటే భారత్ తో పాటు జపాన్ ఆస్ట్రేలియా దేశాలు కూడా నడిచే అవకాశం ఉందని అదే సమయంలో అటు తైవాన్ లాంటి చైనా వ్యతిరేక దేశాలు కూడా భారత్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయని అందుకే చైనా శాంతి వచనాలు వహిస్తుంది అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. అదేసమయంలో జో బైడెన్ ఇప్పుడే అధికారంలోకి వచ్చారు. కాబట్టి చైనా యుద్ధం చేసిన అమెరికా సహకారం అందే అవకాశం లేదని అందుకే జో బైడెన్ తో మరింత సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేసి అప్పుడు యుద్ధం చేయాలని ప్రస్తుతం శాంతి వచనాలు వహిస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు.