గొర్రె కోసం ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. చివరికి..?

praveen
ఈ మధ్యకాలం లో మనుషుల ప్రాణాల కు విలువ లేకుండా పోతుంది. చిన్నచిన్న కారణాల కే ఏకంగా దారుణంగా ఆత్మహత్య కు పాల్పడుతూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరం గా ముగిస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. క్షణికావేశంలో  తీసుకున్న నిర్ణయాల తో ఏకంగా ఎంతో విలువైన ప్రాణాలను బలవంతం గా తీసుకుంటున్నారు ఎంతోమంది. చిన్నచిన్న కారణాలకే విలువైన ప్రాణాల ను తీకుంటున్నారు. టీచర్ తిట్టిందనో  లేదా తల్లిదండ్రులు మందలించారని స్నేహితుల తో గొడవ జరిగిందని ఇలా చిన్నచిన్న కారణాలకే క్షణికావేశం లో నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణా నికి పాల్పడుతున్న  ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి.

ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులో కి వచ్చింది. అతను గొర్రెలు  మేపుతూ ఎంతో హాయిగా జీవితాన్ని గడుపు తున్నాడు. కానీ ఇంతలో విధి వక్రించింది.. అతని సంతోషాన్ని చూసి ఓర్వలేక పోయింది, ఇక అతను మేపుతున్న గొర్రెలను  మృత్యువు రూపం లో కబళించింది. డాక్టర్కు చూపించి నప్పటికీ వరుసగా గొర్రలు చనిపోవడం మొదలైంది. దీంతో అతను ఆందోళన లో మునిగి పోయాడు ఒకరోజు తీవ్ర మనస్థాపం చెంది చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. యువకుడి మరణంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది.

 ఏకంగా గొర్రెలు చనిపోయాయి అన్న కారణంతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్ల రాజు అనే 22 ఏళ్ల యువకుడు రోజు గొర్రెల మేపుతూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇటీవలే ఏదో మాయదారి రోగం వచ్చి గొర్రెలు మృత్యువాత పడుతూ వచ్చాయి. దీంతో ఏకంగా నాలుగు లక్షల వరకు నష్టం వాటిల్లింది ఇక మనస్తాపం చెందిన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: