ఎస్వీబీసీలో పోర్న్ వీడియో లింక్ దుమారం..!

N.ANJI
టీటీడీకి చెందిన ఎస్వీబీసీలో పోర్న్ సైట్ లింక్ కలకలం రేపుతోంది. ఎస్వీబీసీ ఉద్యోగి వల్ల ఘోరమైన తప్పు జరిగింది. శతమానం భవతి వీడియో లింక్ బదులుగా పోర్న్ సైట్ లింక్ పంపాడు ఉద్యోగి. ఈ వీడియో చుసిన భక్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే టీటీడీ ఈవో మెయిల్ కు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన గంటల్లోనే ఎస్వీబీసీలో ఓఎస్‌ఓగా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిని బుధ‌వారం విధుల నుంచి తొల‌గించారు.
అయితే ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో వెంక‌ట క్రిష్ణ అనే భ‌క్తుడు శ‌‌త‌మానం భ‌వ‌తి కార్యక్రమానికి సంబంధించిన వివ‌రాల‌ను మెయిల్ ద్వారా కోరారు. అందుకు ఎస్వీబీసీ ఉద్యోగి భక్తుడికి ఓ అశ్లీల‌ వెబ్‌సైట్ కు సంబంధించిన లింక్ పంపించారు. దీనిపై భ‌క్తుడు టీటీడీ చైర్మన్‌, ఈవోలకు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యంపై స్పందించిన‌ టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి విచార‌ణ‌కు ఆదేశించారు
తక్షణమే టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. ఎస్వీబీసీలో తనిఖీలు చేసింది. పోర్న్ సైట్ లింక్ పంపిన ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  దాదాపు 25 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లతో ఎస్వీబీసీలోని అన్ని కంప్యూటర్లను సెక్యూరిటీ అడిట్ చేశారు. ఈ టీం దర్యాప్తులో నిందితుడే కాక మరో ముగ్గురు నుంచి నలుగురు ఉద్యోగులు ఇలాంటి పనులు చేసినట్లు తెలిసింది. ఇంకా ఎంతమంది ఉద్యోగులు ఇలాంటి పనులు చేశారో పరిశీలించి వారిని కూడా ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఎస్వీబీసీ సీఈవో వెల్లడించారు.
ఇక ఈ సంఘటన అనంతరం సంస్థ ప్రతిష్టను పరిరక్షించడంలో భాగంగా పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ఎస్వీబీసీ కంప్యూటర్ ఆపరేషన్ టీటీడీ ఐటీ విభాగం పర్యవేక్షణలో జరుగుతుందని సీఈవో తెలిపారు. ఎస్వీబీసీలో ప్రతి కంప్యూటర్‌కు పాస్వర్డ్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీని వల్ల కంప్యూటర్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో తెలుస్తుందన్నారు. అలాగే ఎస్వీబీసీని టీటీడీ విజిలెన్స్ పర్యవేక్షణలోనికి తీసుకురావాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: