ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి రైతు గా మారాడు.. చివరికి..?

praveen
ఆత్మసంతృప్తి లేకుండా నచ్చిన పని చేయకుండా ఎన్ని డబ్బులు వచ్చిన వృధా అని చెబుతూ ఉంటారు పెద్దలు.  అందుకే ఎప్పుడూ నచ్చిన పని చేసుకుని ఆనందంగా ఉండడమే మేలు అంటూ సూచిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ఇలాంటి తరహా పనులు చేస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు నచ్చినా నచ్చకపోయినా మంచి జీతం వచ్చే ఉద్యోగం చేస్తూ ఇబ్బందులు పడుతూ సంతృప్తి లేకుండానే జీవితం గడిపేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం చాలామంది అలా చేయడం లేదు. ఎంత  మంచి ఉద్యోగాల్లో కొనసాగుతున్న లక్షల జీతం వస్తున్న కూడా అవన్నీ వదిలేసి తమకు నచ్చిన పని చేస్తున్నారు.

 ఇప్పటివరకు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో  పని చేసిన వారు కూడా... వంట వారు గా మారిపోవడం..  రైతులు గా మారి పోవడం లాంటివి చేస్తూన్న  ఘటనలు సోషల్ మీడియాలో ఎప్పుడూ తెర మీదికి వస్తూనే ఉంటాయి అన్న విషయం తెలుస్తుంది. ఇక్కడ ఓ వ్యక్తి ఇలాంటి చేశాడు. ఈ మధ్యకాలంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని ఎంతగానో ఆరాట పడుతూ ఉంటే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి మరి తనకు నచ్చిన వ్యవసాయం చేసేందుకు పొలంలోకి దిగాడు. అంతేకాదు ప్రస్తుతం యువ రైతు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

 ఉత్తరప్రదేశ్లోని దౌలాపూర్ కు చెందిన అమరేందర్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి దశాబ్ద కాలానికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ ఎంతో మంది విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో మంచి వేతనం తీసుకుంటున్నప్పటికీ అతనికి మనస్సుకు సంతృప్తి మాత్రం అనిపించలేదు. దీంతో వెంటనే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ఏకంగా తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయాన్ని చేసేందుకు ముందుకు వచ్చాడు. యూట్యూబ్ వీడియోలు సహాయంతో 30 ఎకరాల్లో బొప్పాయి స్ట్రాబెరీ అరటి పంటలను పండిస్తున్నాడు. టీచర్ ఉద్యోగం చేసిన కొడుకు 1.2 లక్షల  జీతం వచ్చేదని ప్రస్తుతం వేగంగా సంవత్సరానికి 30 లక్షలు సంపాదిస్తున్నాను  అంటూ గర్వంగా సదరు యువ రైతు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: