అత్యాచారం జరిగితే.. ఆత్మగౌరవం ఉన్న మహిళ చనిపోతుంది..?
అయితే రోజురోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోవడం ఒక ఎత్తయితే మహిళలపై అత్యాచారం జరుగుతున్న ఘటనలపై కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారిపోతున్నాయి. మహిళల తప్పు ఉన్న కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయి అనే విధంగా ప్రస్తుతం ఎంతో మంది సంచలన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పలువురు ప్రముఖులు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఎన్నో విమర్శల పాలయ్యారు తాజాగా ఇలాంటి ఒక విమర్శ చేశారు మరో వ్యక్తి. ఇటీవలే కేరళ సోలార్ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
గతంలో కేరళ కాంగ్రెస్ ప్రముఖులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ సోలార్ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న మహిళ ఆరోపించింది. ఇక దీనిపై స్పందించిన కేరళ పిసిసి చీఫ్ రామచంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొన్నారు. ఆత్మగౌరవం ఉన్న మహిళ అయితే తనపై అత్యాచారం జరిగిన వెంటనే చనిపోతుంది.. లేదా మరోసారి అత్యాచారం జరగకుండా చూసుకుంటుంది.. అంటూ పీసీసీ చీఫ్ రామచంద్రన్ చేసిన వైద్యులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిపోయాయి. ఇక అటు వెంటనే స్పందించిన ఆయన తన వ్యాఖ్యలు మహిళలను కించపరిచే ఉన్నట్లు ఉంటే నన్ను క్షమించండి అంటూ వ్యాఖ్యానించారు.