ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. కస్టమర్లకు లోన్స్.. కేవలం 600 రూ.ల ఈఎంఐ.?

praveen
పండుగ సీజన్ వచ్చిందంటే చాలు అన్ని రకాల సంస్థలు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నో వైవిధ్యమైన ఆఫర్లను అందుబాటులో ఉంచుతాయి అనే విషయం తెలిసిందే. మొన్నటి వరకు దసరా పండుగ నేపథ్యంలో ఎన్నో సంస్థలు ఎన్నో ఆకర్షనీయమైన ఆఫర్లతో తమ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చాయి. ఇక మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ నేపథ్యంలో.. మరోసారి బంపర్ ఆఫర్లు తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచేందుకు సిద్ధమయ్యాయి అన్ని సంస్థలు. ముఖ్యంగా ఈ పండుగ సీజన్లో లోన్ తీసుకోవాలని ఆలోచనలు ఉన్నవారికి... కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అని ప్లాన్ చేస్తున్న వారికి శుభ వార్త చెప్పింది టెలికామ్ కంపెనీ ఎయిర్టెల్.

 ఇప్పటివరకు ఎంతో మెరుగైన టెలికాం రంగ సర్వీసులను తమ కస్టమర్లకు అందించిన ఎయిర్టెల్ ఇప్పుడు ఏకంగా కస్టమర్లకు రుణాలు అందించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా కొత్త మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఎంతగానో ఊరట కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్టెల్ 2జీ అర్హత కలిగిన  కస్టమర్లు 4జికి  అప్గ్రేడ్  చేసుకోవడం కోసం లోన్  తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇక ఎయిర్టెల్ అందించిన ఆఫర్ ప్రకారం మార్కెట్ ధర కన్నా అతి తక్కువ ధరకే మొబైల్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక తమ కస్టమర్లకు ఎయిర్టెల్ లోన్ అందించేందుకు గాను ఐడిఎఫ్సి బ్యాంక్ తో చేతులు కలిపింది.

 అయితే ఈ లోన్ పొందాలి అని భావించే కస్టమర్లు ముందుగా డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక దీని కోసం 3259 రూపాయలు చెల్లించి లోన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు తీసుకున్న రుణాన్ని పది నెలల లోపు చెల్లించాల్సి ఉంటుంది, నెలకు ఈఎంఐ కేవలం 603 రూపాయలు మాత్రమే ఉంటుంది. అంటే కేవలం తొమ్మిది వేల మూడు వందల రూపాయలతో 4జి హ్యాండ్సెట్ లభిస్తుంది అని చెప్పాలి. కేవలం 2జీ  కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఇలా లోన్ తీసుకున్న వారికి 260 రూపాయలతో బండిల్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: