బాబోయ్.. అచ్చెన్నా, చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు..?
అయితే టీడీపీ మాత్రం రెండు విధాలా తన మాటలు చెప్తూ దేనికి సుప్ర్ట్ చేస్తుందో తెలీక అందరిని డైలమా లో పడేస్తుంది.. గతంలో కరోనా విజృంభణ విపరీతంగా ఉందన్న కారణంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఎన్నికల ను వాయిదా వేశారు.. ఇప్పుడు కరోనా ఇంకా ఎక్కువగానే ఉండడంతో అయినా ఎన్నికలను నిర్వహిస్తున్నామని అంటున్నారు.. ఇందులో విధేయత ఎక్కడ ఉందొ ఆయనకే తెలియాలి.. ఇకపోతే ఈ విషయంలో అచ్చెన్న మాట్లాడే మాటలకు, చంద్రాబు మాట్లాడే మాటలకూ చాలా తేడా కనిపిస్తుంది..
కరానో వారియర్స్ తో వెబినార్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కరోనా మహమ్మారి రెండోసారి తిరగబెడుతోంది. ఆసియా దేశాల్లో రెండోసారి కరోనా కేసులు నమోదవుతున్నాయి. రెండోసారి కరోనా సోకిన వారిలో తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ టైం లో ఎన్నికలు సాహసాలు చేయొద్దని సూచనలు ఇస్తున్నారు.. మరో వైపు అచ్చెన్న మాత్రం కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుంటే ఇప్పుడు ఎన్నికలు వద్దంటున్నారు. ప్రాంతాలు, కులాల మధ్య తగాదాలు సృష్టించడం, సంక్షేమం లేకపోవడంతో, ఈ సమయంలో ఎన్నికలు పెడితే దెబ్బతింటామని వైసీపీ భావిస్తోంది అంటూ ప్రభుత్వాన్ని దోషి గా మలిచే ప్రయత్నం చేస్తున్నారు.. మరీ వారి మాటల తీరు అవకాశవాద రాజకీయాలను స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ రాజకీయం ఎలా ఉందొ ప్రజలు మరోసారి స్పష్టముగా తెలుసుకున్నారు..