ఇంట్లో నుండే పాన్ కార్డు అప్డేట్ చేసుకోండి ఇలా..?
ఈ మధ్య కాలంలో అయితే పాన్కార్డ్ ఆవశ్యకత రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే పాన్ కార్డు అప్లై చేసుకున్నప్పటికి కొంత మంది వివరాలు మాత్రం పాన్ కార్డులో తప్పుగా పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే పాన్ కార్డులో తప్పుగా పడిన వివరాలను సత్వరంగా సరి చేసుకోవడం ఎంతో మంచిది అని అటు నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పాన్ కార్డు ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్ కాబట్టి తప్పులు సత్వరంగా సరి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు.
అయితే పాన్ కార్డ్ లో తప్పుగా ఉన్న వివరాలు అప్డేట్ చేసుకోవడం ఎంతో సులువుగా మారిపోయింది నేటి రోజుల్లో. దీనికోసం నెట్ సెంటర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని వివరాలు అప్డేట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ముందుగా ఏం డి ఎస్ ఎల్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇందులో సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేసి పాన్ కార్డు ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు పాన్ డేటా వివరాల మార్పు లేదా పాన్ కార్డ్ రిప్రింట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు కొత్త అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఫిల్ చేయాలి. ఇంకా ఈకేవైసీ పూర్తి చేయాలి. తర్వాత డబ్బులు కట్టాలి. ఇక చివరిలో అన్ని డాక్యుమెంట్లను ఎన్ఎస్‌డీఎల్ ఇగవ్ ఆఫీస్కు పంపించాల్సి ఉంటుంది. తర్వాత మీ వివరాలు అప్‌డేట్ అవుతాయి