ఐపీఎల్ 2020లో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం వరుస రెండు పరాజయాలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సీజన్ ఐపీఎల్ దుబాయ్‌లో జరుగుతున్న నేపథ్యంలో అనుష్క కూడా విరాట్‌తో పాటు అక్కడికి వెళ్లి బెంగుళూరు టీంను ఉత్సాహపరుస్తున్న సంగతి తెలిసిందే. గత ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు అనుష్క స్టేడియానికి వచ్చింది. మ్యాచ్ విరామ సమయంలో గ్యాలరీలో ఉన్న అనుష్క వైపు చూస్తూ ఏమైనా తిన్నావా? అని కోహ్లీ సైగ చేశాడు. హా..తిన్నాను అంటూ అనుష్క చిరునవ్వుతో థమ్స్ అప్ సింబల్ చూపించింది.
మ్యాచ్ సమయంలో మైదానంలో ఉన్న కోహ్లీ స్టాండ్స్‌లో ఉన్న తన భార్య అనుష్కపై చూపించిన ప్రేమాభిమానాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కోహ్లీ, అనుష్క త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే.
మరింత సమాచారం తెలుసుకోండి: