బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి.. చంద్రబాబు ఆ కంపెనీ పెట్టారు..?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ మెజారిటీ సాధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ప్రతిపక్షాలు అధికార పార్టీ మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు పర్వం కొనసాగుతూనే ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఎక్కడ తగ్గుముఖం పట్టలేదు. అందుకే  ఎప్పుడూ ఆంధ్ర రాజకీయాలూ  హాట్ హాట్ గానే సాగుతూ ఉంటాయి. ఇక ఏదో ఒక వ్యవహారం తెరమీదికి వస్తూ ప్రతిపక్షాలు అధికార పార్టీ మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. అయితే జగన్ సర్కార్ పై విమర్శలు చేసే ప్రతిపక్ష టీడీపీ నేతలను టిడిపి అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో కామెంట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు వైసిపి పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి.

 ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఇప్పటికీ తనదైన శైలిలో ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడుతూ చంద్రబాబు పై తన విమర్శలతో విరుచుకుపడుతూ ఉంటారు. ఇక మరోసారి చంద్రబాబు చంద్రబాబు తీరుపై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి. హెరిటేజ్ సంస్థ నష్టాల్లో ఉంది అంటూ వ్యాఖ్యానించిన విజయసాయిరెడ్డి చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ పై సెటైర్లు వేశారు..

 చంద్రబాబు అవినీతి అక్రమాలు చేసి సంపాదించిన డబ్బును ఎవరికీ తెలియకుండా వైట్ మనీగా మార్చుకోవడానికి హెరిటేజ్ అనే కంపెనీని పెట్టారు అంటూ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ కంపెనీకి కోటాను కోట్ల లాభాలు వస్తాయని అది అధికారంలో లేనప్పుడు మాత్రం హెరిటేజ్ సంస్థ నష్టాల పాలు అవుతుంది. ఏమిటో ఈ హెరిటేజ్ కిటుకు అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు స్వార్థం కోసం పాడి రైతుల ఆధ్వర్యంలో నడిచే కో-ఆపరేటివ్ డైరీలను బ్రష్టు పట్టించి రైతులను సర్వనాశనం చేశారు అంటూ మండిపడ్డారు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: