పయ్యావుల ను చంద్రబాబు ని ఎందుకు దూరం పెట్టాడు..?

P.Nishanth Kumar
చంద్రబాబు అనవసరపు విమర్శలు ఎలాంటి దారుణానికి తీస్తాయో తెలీదు కానీ అయన చేసే వ్యాఖ్యలపై మాత్రం ప్రజలు చాలా కోపంగా ఉన్నారు.. చీటికీ మాటికీ ముఖ్యంన్త్రి స్థాయి హోదాలో ఉన్న జగన్ ను విమర్శించడం వారు ససేమీరా సహించడం లేదు.. అయితే చంద్రబాబు మానసిక పరిస్థితి ఎలా ఉందొ అని ప్రజలు ఆయనపై జాలి చూపిస్తున్నారు.. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి గా చేసి సడెన్ గా దారుణ ఓటమి చెందడంతో అయన కు ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు..  అయితే వచ్చే ఎన్నికలనాటికి అయన ఓల్డ్ ఏజ్ తో మానసిక పరిస్థితి కూడా కొంత ఆందోళన కరంగా ఉంటుందన్నది మాత్రం అందరు గ్రహిస్తున్న విషయం..
పరిస్థితులను తనకు ప్రతికూలంగా ఉన్న దాన్ని మార్చుకునేందుకు జగన్ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తన పార్టీ లోకి వచ్చే నేతలను కాదనకుండానే రాజీనామా పద్ధతిని ముందర పెడుతున్నారు.. అయితే ఆ వచ్చే నేతలు రాజీనామాకు పెద్దగా ఇష్టపడకపోయినా తమ కుటుంబ సభ్యులను చేర్చి చాలా సాగె గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే వీరి రాక కు ముఖ్య కారణం చంద్రబాబు వైఖరి అని తెలుస్తుంది.. ఒకప్పుడు టీడీపీ లో చక్రం తిప్పిన నాయకులను పక్కన పెట్టడం వల్లే వారు ఇతర పార్టీ లకు వలసపోతున్నారని అంటున్నారు..
తాజాగా పయ్యావుల కేశవ్ ని చంద్రబాబు ఎందుకో పక్కకు పెట్టారు అనిపిస్తుంది.. ఇటీవలే టీడీపీలో కీల‌క నేత‌ల‌కు చంద్రబాబు ప‌ట్టం క‌ట్టారు. పార్లమెంట‌రీ ప‌ద‌వులు , పార్లమెంట‌రీ మ‌హిళా క‌మిటీలని, రాష్ట్ర క‌మిటీ, పొలిట్ బ్యూరో, జాతీయ ప‌ద‌వులు అంటూ చాలా అధికారంలేని పదవులు సృష్టించి వాటిలో కొంతమంది టీడీపీ నాయకులను ఎంపిక చేశారు.. ఇందులో పయ్యావుల కు ఛాన్స్ లేకపోవడం కొంత అనుమానానికి దారి తీస్తుంది.. అయితే దీనికి కారణాలు లేకపోలేదట.. ప‌య్యావుల కేశవ్ త‌న ప‌ద‌వికి న్యాయం చేయ‌డంలో ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడ‌న్నది టీడీపీ వాదన..ప‌య్యావుల కేశవ్ కూడా పార్టీ ఓటమి నుంచి అంటీముట్టన‌ట్టే ఉంటోన్నది ఓపెన్‌గానే తెలుస్తోంది. ఇక‌, పార్టీ త‌ర‌ఫున కార్యక్రమాల‌కు హాజ‌రు కాక‌పోవ‌డం చంద్రబాబు ఆగ్రహానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: