ఎట్టకేలకు కేంద్రం శుభవార్త: మారటోరియం రుణాలపై వడ్డీ రద్దు...

VAMSI
కరోనా వైరస్ దెబ్బకి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. దాదాపు అన్ని రంగాలు చతికిలపడ్డాయి. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీముఖ్యంగా వలస కూలీలు, దైనందిన కార్మికులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కోవిడ్ 19 వల్ల ప్రజల ఆదాయం బాగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజలకు ఊరట కలిగే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లోన్ మారటోరియం ఆప్షన్ తీసుకువచ్చింది. తొలిగా మూడు నెలలపాటు ఈఎంఐ కట్టక్కర్లేదని తెలియజేసింది. తర్వాత దీన్ని మరో మూడు నెలలు పొడిగించింది.
ప్రజలంతా పనులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం లోన్ తీసుకున్న వారికి తీపికబురు అందించేందుకు సిద్ధమౌతోంది. మరీముఖ్యంగా లోన్ మారటోరియం ప్రయోజనం పొందిన వారికి ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. వడ్డీ మీద వడ్డీ మాఫీ నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఇటీవలే తెలిపింది. ఈ దసరా పండుగ సందర్భంగా రుణ గ్రహీతలకు ఊరట కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మారటోరియం నిర్ణయించిన కాలానికి 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు లోన్లకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రకటించిన మారటోరియం కాలానికి ఈ స్కీమ్‌ వర్తిస్తుందని కేంద్రం స్పష్టంచేసింది. మారటోరియం ఉపయోగించుకోని వారికి కూడా ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. అక్టోబర్‌ 14న ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని, సామాన్యుడి దీపావళి కేంద్రం చేతిలో ఉందంటూ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 2కు వాయిదా వేసింది.   అయితే ఇంతకాలం కొనసాగుతూ వచ్చిన మారటోరియం వడ్డీపై త్వరలోనే తుదిబీ తీర్పు వచ్చి రుణగ్రహీతలంతా రానున్న దీపావళిని సుఖ సంతోషాలతో జరుపుకోవాలి కోరుకుందాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: