ఎల్ఐసి కస్టమర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే పాలసీ..?

praveen
ప్రస్తుతం ఎంతోమందికి ఆర్థికంగా అండగా నిలుస్తూ రోజురోజుకు తమ కస్టమర్లను పెంచుకుంటూ దూసుకుపోతుంది ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తమ కస్టమర్లకు ఎన్నో రకాల క్రీమ్లను అందుబాటులో ఉంచి ఎంతో మందికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రోజురోజుకు ఎన్నో రకాల సరికొత్త స్కీమ్ లతో కస్టమర్లను ఆకర్షిస్తూ.. దూసుకుపోతుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్ లను  తమ కస్టమర్లకు అందించిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇటీవలే సరికొత్త పాలసీతో కస్టమర్ల ముందుకు వచ్చింది.

 కొత్తగా జీవన్ శాంతి ప్లాన్ ను ఆవిష్కరించింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇది కొత్త డిపార్ట్ యాన్యుటీ ప్లాన్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా నాన్ పార్టీస్ పేటింగ్,  నాన్ లింక్ సింగిల్ ప్రీమియం ఇండివిడ్యువల్ ప్లాన్ ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తీసుకువచ్చిన జీవన్ శాంతి ప్లాన్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తమ కస్టమర్లు అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చిన కొత్త జీవన్ శాంతి పాలసీ తీసుకునే సమయంలోనే... యాన్యుటీ రేట్లు నిర్ణయించబడతాయి అని చెప్పాలి. కస్టమర్లు యాన్యుటీ డబ్బులు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారమే చెల్లిస్తారు.

 ఇక మీరు జీవించి ఉన్నంతకాలం యాన్యుటీ డబ్బులు వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీరు పాలసీ తీసుకున్న పదేళ్ల మెచ్యూరిటీ సమయం తర్వాత డబ్బులు పొందాలి అని ఆప్షన్ ఎంచుకుంటే అప్పటి నుంచి డబ్బులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇలా పాలసీదారుడు జీవితకాలం పాటు డబ్బులు పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే సింగిల్ ప్రీమియం ద్వారా ఈ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ కొత్త ప్లాన్లు రెండు ఆప్షన్లు కూడా తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సింగిల్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్ ఒకటి అయితే.. జాయింట్ లైఫ్ యాన్యుటీ రెండో ఆప్షన్. ఈ రెండింటిలో నచ్చిన ఆప్షన్ ఎంచుకోవడానికి కస్టమర్లకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: