తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ధరణి పోర్టల్ లో ఆ సదుపాయం..?

praveen
తెలంగాణ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థ రద్దు చేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకం గా ధరణి పోర్టల్  అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక  ఈ ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎంతో సులభతరం  చేసి  ప్రజలందరి కీ మేలు జరిగేలా చేయడాని కి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ ధరణి పోర్టల్ దసరా నుంచి అందుబాటు లోకి రానున్న విషయం తెలిసిందే. ముఖ్యం గా తెలంగాణ లోని వ్యవసాయ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను మరింత సరళీకరణ చేయడానికి ధరణి పోర్టల్ అందుబాటు లోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

 అయితే కేవలం ధరణి పోర్టల్ అందుబాటు లోకి తీసుకురావడమే కాదు పోర్టల్  సేవలను ప్రజలందరి కీ మరింత సులభతరం గా అర్థమయ్యే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కేవలం తహసీల్దార్ కార్యాలయాల కు వచ్చేలా చేసిన విషయం తెలిసిందే. తహసిల్దార్ కార్యాలయం లోనే గంటల వ్యవధిలో ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో ఎన్నో రోజుల పాటు నెలల పాటు వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఇక ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారికి ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది.


 అయితే తెలంగాణలోని వ్యవసాయ వ్యవసాయేతర ఆస్తుల నమోదు కు సంబంధించిన ప్రక్రియ ప్రజలందరి కీ ఎంతో సులభంగా అర్థమయ్యే విధంగా ధరణి పోర్టల్ లో ఆంగ్లం తో పాటు తెలుగు భాషను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. ఇక పోర్టల్  సామాన్యులకు కూడా ఎంతో స్పష్టంగా అర్థమై సులభంగా ప్రక్రియ కొనసాగే  విధంగా ఆంగ్ల పదాలను తెలుగులోనూ తర్జుమా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దసరా నుంచి ఈ ధరణి పోర్టల్ అందుబాటులోకి రానుండగా..  సీఎం కేసీఆర్ ఈ ధరణి పోర్టల్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: