రాపాక ఎటూ కాకుండ పోయాడేంటి.. వైసీపీ ని నమ్ముకున్నా పోయేది..?
ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జనసేన పార్టీ గెలిచిన ఏకైక నియోజకవర్గం అని అందరికి తెలిసిన సంగతే.. పవన్ కళ్యాణ్ కూడ రెండు స్థానాల్లో పోటీ చేసిన గెలవలేదు.. అలాంటిది రాపాక వరప్రసాద్ జనసేన తరపున గెలిచారు. మొదట్లో అయన స్పెషల్ గా అందరికి కనిపించే వారు కానీ ఇప్పుడు రాపాక ని ఎవరు పట్టించుకోకపోవడం గమనార్హం.. గెలిచిన జనసేన పార్టీని కాదని వైసిపికి దగ్గరైన రాపాకకు ఇపుడు అధికారపార్టీలో ఆదరణ కరువైందట. గెలిచిన దగ్గర నుండి తన వ్యవహారశైలి కారణంగా వైసీపీకి అనుబంద సభ్యునిగానే రాపాక కంటిన్యు అవుతున్నారు. తనకు తాను వైసీపీ ఎంఎల్ఏగానే ప్రకటించేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో జనసేన కు కూడ అయన పూర్తి గా దూరమైపోయారని చెప్పొచ్చు..
అయితే కొద్దిరోజులుగా నియోజకవర్గంలో రాపాక పరిస్ధితి తల్లకిందులైందని మద్దతుదారులే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలోని పనుల కోసం ఎంఎల్ఏ అధికారుల దగ్గరకు వెళ్ళినపుడు ఎవరు పెద్దగా పట్టించుకోవటం లేదట. ఒకపుడు అధికారుల దగ్గర మంచి జోరు కనబరచిన రాపాకకు ప్రస్తుతం చుక్కెదురవుతోందట. హఠాత్తుగా రాపాక పరిస్దితి ఎందుకు ఇలా దిగజారిపోయింది ? ఎందుకంటే మొన్నటి వరకు నియోజకవర్గంలోని వైసీపీ రెండు వర్గాల్లో ఒకటి ఎంఎల్ఏకు మద్దతుగా నిలబడిందట.