వలసదారులు అందరికీ అమెరికా పౌరసత్వం.. సంచలన హామీ..?
ఇలాంటి క్రమంలో త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓటు ఎంతో కీలకంగా మారబోతున్న విషయం తెలిసిందే. కేవలం భారత అమెరికన్లే కాకుండా వివిధ దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన వారి ఓట్లు కూడా ఎంతో కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ చేసేవారు. ఈ క్రమంలోనే డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న జో బైడెన్... అమెరికాకు వలస వచ్చే వారందరికీ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
జో బైడెన్ ఇచ్చిన సంచలన హామీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో వివిధ దేశాల నుంచి వలస వచ్చి ఉంటున్న 1.1 కోట్ల మంది వలసదారులకు అమెరికా పౌరసత్వాన్ని ఇస్తామని జో బైడెన్ సంచలన హామీ ఇచ్చారు. కరోనా సంక్షోభం, అమెరికా ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం, వలసదారుల సమస్యలు తన ఎజెండాలో అగ్రభాగాన ఉంటాయి అంటూ చెప్పుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు డోనాల్డ్ ట్రంప్ భ్రష్టు పట్టించిన అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టి అందరికీ మేలు చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు జో బైడెన్.