రాహుల్ గాంధీకి మేకపిల్లకి, గొర్రెపిల్లకి తేడా తెలియదట..?

praveen
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి  ప్రతిపక్షాల విమర్శలు మధ్య ఉభయ సభల్లో ఆమోదం ముద్ర వేయించుకుని వాటిని చట్టాలు గా మార్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుపై   ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అటు బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన నాటి నుంచి నేడు చట్టాలుగా మారినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలను  మాత్రం ఆపడం లేదు ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం తో పాటు ఇక నిరసనలు కూడా తెలుపుతున్న విషయం తెలిసిందే.

 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు ద్వారా రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది అంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్... వెంటనే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. అంతే కాకుండా ఈ వ్యవసాయ చట్టాల ద్వారా భారతదేశంలోని వ్యవసాయ మొత్తం కార్పోరేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది అంటూ ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే ఈ వ్యవసాయ బిల్లులపై ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీలు నిరసన ర్యాలీలు కూడా చేపడుతున్న విషయం తెలిసిందే. అందరూ ఈ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

 అటు అధికార బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ కౌంటర్ ఇస్తుంది ఇటీవలే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వ్యవసాయ చట్టాల పై నిరసన చేయడంపై స్పందించిన కేంద్రమంత్రి గజేంద్ర శకావత్  విమర్శలు గుప్పించారు.  రాహుల్ గాంధీ కి మేక పిల్ల కి గొర్రె పిల్ల కి తేడా తెలియదు అంటూ విమర్శలు చేశారు.  వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లు ఒక ఆకు చూసి అది ఏ పంటో  చెప్పగలిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాంటివాళ్లు వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు కేంద్రమంత్రి గజేంద్ర శకావత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: