చైనా సైన్యం గురించి ఆ నిజం బయట పెట్టిన అమెరికా..?

praveen
భారత్-చైనా సరిహద్దు లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. నిషేదిత  ప్రాంతం లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవడమే కాకుండా  భారత సైన్యాన్ని కవ్వింపు లకు దిగుతూనే ఉంది చైనా. ఏకంగా పలుమార్లు భారత సైనికుల పై ఫిజికల్ దాడికి కూడా పాల్పడింది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు భారతసైన్యం అప్రమత్తంగా ఉంటూ చైనా దాడులను తిప్పి కొడుతూనే ఉంటుంది.. అదే సమయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ చైనా అధీనంలో ఉన్న పలు పర్వతాలను కూడా భారత్ స్వాధీనం చేసుకొని మంచు కురిసే చలిలో కూడా ప్రస్తుతం అక్కడే దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి నిలబడిన విషయం తెలిసిందే.


 అయితే భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తలా దృశ్య అటు చైనా ఇటు భారత్ కూడా భారీగా సైనికులను మొహరిస్తుంది. అయితే భారత్ మొహరించిన సైనికులు ఆయుధాలకు సంబంధించిన వివరాలను కూడా ప్రపంచానికి తెలియ జేస్తుంది. కానీ చైనా మాత్రం ఎలాంటి వివరాలను బయటకు చెప్పడం లేదు. అయితే భారత్-చైనా ఉద్రిక్త పరిస్థితులు మొదలైనప్పటి నుంచి ఈ వివాదంపై స్పందిస్తూ చైనా పై విమర్శలు గుప్పిస్తోంది అమెరికా. ఇక ఇప్పుడు మరో సారి చైనా కు షాక్ ఇచ్చే విధంగా కొన్ని గణాంకాలను తెలిపింది.

 భారత్ వెంబడి  సరిహద్దులో చైనా 60 వేలమంది సైనికులను మోహరించింది అంటూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. సరిహద్దులో చైనా వ్యవహారం ఒక చెడు వైఖరి అన్నట్లుగా అభివర్ణిస్తూ ఆయన తప్పు పట్టారు. చైనా ప్రవర్తన క్వాడ్  కంట్రీస్ అయినా భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా లకు ముప్పుగా పరిగణిస్తున్నామని అంటూ చెప్పుకొచ్చారు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో. ఇక క్వాడ్  దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం టోక్యో వేదికగా ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: