ఐక్యరాజ్య సమితికి భారత్ వార్నింగ్.. ఎందుకో తెలుసా..?
ఇక ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన విషయంలో కొంతమంది దేశం పై బురద జల్లే వాళ్ళు దారుణ ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇలాంటి క్రమంలో ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో జరిగిన ఘటన పై ఐక్యరాజ్యసమితి సైతం ప్రస్తుతం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీనిపై స్పందించిన భారత విదేశాంగ శాఖ మంత్రి ఒక రకంగా ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యలను ఖండిస్తూ వార్నింగ్ ఇచ్చింది అని చెప్పాలి.
ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ లో జరిగిన ఘటనపై స్పందించిన ఐక్యరాజ్యసమితి భారత్లో పరిస్థితులపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నాము అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.. దీంతో వెంటనే స్పందించిన భారత విదేశాంగ శాఖ స్పష్టమైన జవాబు ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి సమన్వయకర్త చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసింది భారత విదేశాంగ శాఖ. విచారణ కొనసాగుతున్నట్టువంటి సందర్భంలో ఆ ఘటనపై బయటి సంస్థ వ్యాఖ్యలు చేయడం సరి కాదు అంటూ తేల్చి చెప్పింది. ప్రజాస్వామ్యం ప్రకారం అందరికీ సమాన హక్కులు లభిస్తాయి అంటూ గుర్తు చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఘటనని వేరే కోణంలో చూపించేందుకు ప్రయత్నించవద్దు అంటూ ఒక రకంగా ఐక్యరాజ్యసమితి కి వార్నింగ్ ఇచ్చింది భారత విదేశాంగ శాఖ.