ఆ రెండు దేశాలతో యుద్దానికి సిద్ధం అంటున్న భారత్..?

praveen
భారత్ చైనా సరిహద్దు లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న సరిహద్దు లో సరికొత్త వివాదానికి తెరలేపిన చైనా... ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ సరిహద్దుల్లో  రోజురోజుకు తోక జాడింపు  చర్యలకు పాల్పడుతోంది. అంతే కాదు భారత సైన్యాన్ని కవ్వింపు లకు దిగుతూనే ఉంది చైనా. దీంతో రోజురోజుకు సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇక సరిహద్దులో చైనాతో ఏక్షణంలోనైనా యుద్ధం తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత ఆర్మీ మరింత పటిష్టంగా మారిపోతున్న విషయం తెలిసిందే. త్రివిధ దళాలు కూడా ప్రస్తుతం చైనాతో యుద్ధానికి సంసిద్ధం అయిపోయాయి. సరిహద్దుల్లో భారీగా సైనికులు మోహరించడం తో పాటు ఆయుధాలు కూడా వచ్చి చేరుతున్నాయి.


 అదే సమయంలో భారత సైనికులు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ... ఏకంగా చైనా వ్యూహాత్మక ప్రదేశాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటూ ఉండటం... చైనా కు మరింత షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే చైనా  మిత్ర దేశంగా ఉన్న పాకిస్తాన్ కూడా చైనాతో యుద్ధం తలెత్తితే జోక్యం చేసుకునే అవకాశం ఉందని భారత్  భావిస్తున్న విషయం తెలిసిందే. లేదా రెండు దేశాలు కలిసి ఒకేసారి భారత్ తో  యుద్ధం ప్రకటించిన ఆశ్చర్యపోనక్కర్లేదని భారత రక్షణ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాతో  యుద్ధం చేయాల్సి వస్తే చేయడంతో మాత్రమే కాదు పాకిస్తాన్ తో  కూడా తప్పదు అని భావిస్తుంది భారత్.

 అయితే తాజాగా ఇదే విషయాన్ని  ఎయిర్  చీప్ మార్షల్ బదౌరియా  వెల్లడించారు. పాకిస్తాన్ చైనా దేశాలు ఒకేసారి భారత్ పై  యుద్ధానికి వచ్చిన... ఆ రెండు దేశాలకు సరైన బుద్ధి చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని అంటూ చెప్పుకొచ్చారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కేవలం లడక్ ప్రాంతంలో మాత్రమే కాకుండా ఎల్ఏసీ  ప్రాంతంలో కూడా భారీగా సైన్యాన్ని మొహరించాము  అంటూ ఆయన చెప్పుకొచ్చారు. భారత అమ్ములపొదిలో రఫెల్ యుద్ధ విమానాల చేరికతో సరిహద్దుల్లో  శత్రువుల కంటే ఎంతో శక్తివంతంగా మారాము అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. మరిన్ని  రఫెల్ జట్ల కొనుగోలుకు ప్రతిపాదనలు ఉన్నాయి అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: