పాడుపనికి ఒప్పుకోలేదని.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. చివరికి..?
ఇక ఈ మధ్య కాలంలో అయితే తెరమీదకి వస్తున్న ఘటనలు ఎన్నో అందరిని ఉలిక్కిపాటు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఆడపిల్లల పై కన్నేస్తున్న కామాంధుడు అత్యాచారం చేయడమే కాకుండా ప్రాణాలు సైతం తీస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక పై కన్నేసిన కామాంధుడు సరైన సమయం కోసం వేచి చూశాడు. చివరికి ఓ రోజు ఆ బాలికపై అత్యాచారం చేయబోగా బాలిక ప్రతిఘటించింది. దీంతో ఉన్మాదిగా మారిపోయిన వ్యక్తి ఏకంగా మైనర్ బాలిక పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఒక్కసారిగా స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
ఈ దారుణ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఓ కుటుంబంలో ఉన్న బాలిక తల్లిదండ్రులకు చేయూత గా ఉండేందుకు ఓ ఇంట్లో పనికి కుదిరింది. అయితే యజమాని కొడుకు సదరు 13 ఏళ్ళ బాలిక పై కన్నేశాడు. ప్రలోభ పెట్టి లొంగదీసుకొని కామ కోరికలు తీర్చు కోవాలని అనుకొన్నాడు. కానీ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా బాలిక ప్రతిఘటించడంతో చివరికి మైనర్ బాలిక పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చూసిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పారు. అప్పటికే 70% కాలిపోయిన బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.