ప్రేయసి కోసం తనను తానే అమ్మకానికి పెట్టుకున్న యువకుడు.. ఎంకరేజ్ చేసిన తండ్రి..?
ఈ ఆసక్తికర ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది. అలెన్ క్లెటన్ అనే యువకుడు ఎన్నో డేటింగ్ యాప్ లలో ఒక జోడి కోసం వెతికాడు. వృత్తిరీత్యా లారీ డ్రైవర్ అయిన సదరు యువకుడికి... ఎన్ని డేటింగ్ యాప్ లలో వెతికినప్పటికీ ప్రియురాలు మాత్రం దొరకలేదు. ఇక వెతికి వెతికి చివరికి విసిగి పోయాడు. చివరికి వినూత్న ఆలోచన చేసి తనను తానే అమ్ముకోవాలని నిర్ణయించుకున్నాడు సదరు వ్యక్తి. ఈ మేరకు ఫేస్బుక్లో ఒక ప్రకటన కూడా చేశాడు. నా పేరు అలెన్... వయసు 30 సంవత్సరాలు... అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్నాను... ఇకనుంచి అన్ని వేడుకలకు ఒంటరిగా వెళ్లాలి అనుకోవడం లేదు.. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాను అంటూ ఆసక్తికరంగా ఒక ప్రకటన చేశాడు.
అయినప్పటికీ సదరు యువకుడికి మాత్రం ఆ అదృష్టం కలిసి రాలేదు. చాలామంది అమ్మాయిలు అతనితో మాట్లాడినప్పటికీ అది డేటింగ్ చేసేంతవరకు మాత్రం రాలేదు. ఇక క్లేటన్ చేసిన విచిత్ర ప్రకటన ఏకంగా తండ్రిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తండ్రి ఇక కొడుకుని ప్రోత్సహించడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. తన కొడుకు ఎంతో మంచి వాడని... చెప్పిన మాట వింటాడని... ఇంట్లో అంట్లు తోమడం వంట చేయడం అన్నీ చేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు సదరు యువకుడి తండ్రి. మరి ఇకనైనా సదరు యువకునికి అమ్మాయి దొరుకుతుందో లేదో చూడాలి మరి.