భక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ప్రారంభం..?

praveen
అతి తక్కువ కరోనా  వైరస్ కేసులు ఉన్న రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత మాత్రం అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో చేరిన విషయం తెలిసిందే ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిపోయింది. కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా దేవాలయాలపై పడిన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా తగ్గడం లేదు. దీంతో  దేవుడికి భక్తులకు దూరం మరింత పెరిగి పోతూనే ఉంది రోజురోజుకు. ఈ కరోనా  నిబంధనలలోనే  శ్రావణమాసం కూడా పోయింది. సాధారణంగా అయితే శ్రావణ మాసంలో దేవాలయాల్లో ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు భక్తులు. కానీ ఈసారి మాత్రం అది కుదరలేదు అని చెప్పాలి.

 అయితే దీంతో ఎంతో మంది భక్తులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కరోనా  వైరస్ నేపథ్యంలో తమ బాధలు కనీసం దేవుళ్లకు చెప్పుకోవాలి  అన్న ప్రస్తుతం అవకాశం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. అయితే ప్రస్తుతం ప్రముఖ ఆలయాల నిర్వాహకులు భక్తులు వ్రతాన్ని  చేసుకునేందుకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. కానీ డైరెక్ట్ గా కాకుండా ఆన్లైన్ పద్ధతిలో ఈ వ్రతాలు చేసుకునేందుకు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. దీంతో భక్తులు ఏదో ఒకటి దేవుడికి పూజ చేసే అవకాశం అయితే వచ్చింది కదా అనుకుని కాస్త నిరాశ తోనే సంతృప్తి పడుతున్నారు.


 ఇక తూర్పు గోదావరి జిల్లా అన్నవరం అధికారులకు భక్తులు  శుభవార్త చెప్పారు. ఇవాల్టి నుంచి ఆన్లైన్లో వ్రతాలు నిర్వహించాలి అని తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఇక ఈ వ్రతం లో పాల్గొనడానికి ఆన్లైన్లో భక్తులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా డబ్బులు చెల్లించిన భక్తులకు ఆలయ నిర్వాహకులు ఒక లింకు పంపిస్తారు.  ఈ లింక్ ద్వారా స్వామి వారి వ్రతం ఆన్లైన్లో వీక్షించడం తో పాటు పురోహితులు చెప్పిన విధంగానే భక్తులు ఇంట్లో వ్రతం చేసుకోవాల్సి ఉంటుంది. కాగా  దీని కోసం వెయ్యి 116 రూపాయలు చెల్లించాలి భక్తులు. ఇక ఈ ఆన్లైన్ వీడియో కోసం ఆలయ ప్రాంగణంలోనే స్టూడియో ఏర్పాటు చేయనున్నారు ఆలయ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: