ట్యూషన్ కి వెళ్తే కరోనా అంటుకుంది.. చివరికి..?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య ఎంత లా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజు రోజుకీ విజృంభిస్తున్న ఈ మహమ్మారి వైరస్ కేసులు బారినపడి ఎంతోమంది ప్రాణాలు వదలడమే కాకుండా ఇంకా ఎంతోమంది మృత్యువుతో పోరాడుతున్నారు. ముఖ్యంగా అవగాహన లేమి, నిర్లక్ష్యం వెరసి ఎంతో మందికి ఈ మహమ్మారి వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న  విషయం తెలిసిందే. కొంతమంది కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేయడంతో వారి ద్వారా ఎంతోమంది కూడా కరోనా  వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడాల్సి వస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసుల సంఖ్య ఎక్కువవుతోంది.


 ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఒక ఉపాధ్యాయుడు కారణంగా ఏకంగా విద్యార్థులు మృత్యువుతో పోరాడాల్సి  వచ్చింది. ఉపాధ్యాయుడు నిర్లక్ష్యం ఏకంగా  కరోనా వైరస్ బారిన పడేలా చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక ఉపాధ్యాయుడు కారణంగా 15 మంది పిల్లలకు కరోనా  వైరస్ సోకటమే కాదు వారి తల్లిదండ్రులకు కూడా కరోనా  సోకింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇక 15 మంది విద్యార్థులకు ఒకేసారి కరోనా  వైరస్ సోకడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 బాగా చదువుకోవడానికి ట్యూషన్ కి వెళ్లిన పిల్లలు చివరికి కరోనా  వైరస్ బారిన పడటం స్థానికంగా అందరిలో  ఆందోళన కలిగించింది. సత్తెనపల్లి లోని భట్లూరు గ్రామంలో... ఉపాధ్యాయుడు ట్యూషన్ క్లాస్ నిర్వహించాడు. అయితే సదరు ఉపాధ్యాయుడికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేశాడు. అయితే ప్రభుత్వం ఎలాంటి ట్యూషన్లు నిర్వహించకూడదని నిబంధన పెట్టినప్పటికీ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ట్యూషన్ నిర్వహించాడు. చివరికి ఆ ఉపాధ్యాయుడు కారణంగా ట్యూషన్ కి వచ్చిన పదిహేను మంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడ్డారు. అంతేకాదు వారి తల్లిదండ్రులకు కూడా కరోనా  వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారందరిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ట్యూషన్  నిర్వహించిన ఉపాధ్యాయుడిపై చర్యలకు ఉపక్రమించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: