లూడో గేమ్ లో గెలిచిన తండ్రి.. ఇదంతా చీటింగ్ అంటూ కోర్టు మెట్లెక్కిన కూతురు.. చివరికి..?

praveen
ఈ మధ్యకాలంలో ఆన్లైన్ గేమ్స్ ఎక్కువైపోయాయి అన్న విషయం తెలిసింది. ఇక ప్రతి ఒక్కరూ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. కొంతమంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ బానిసలుగా మారిపోతుంటే మరికొంతమంది మాత్రం సరదాకి ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేస్తూ ఉంటారు. స్నేహితులే కాదు కుటుంబ సభ్యులు కూడా కొన్ని కొన్ని సార్లు ఆన్లైన్ లో  గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. తండ్రి కూతురు ఇలాగే కాలయాపన కోసం ఓ గేమ్ ఆడారు. గేమ్ లో జరిగిన చిన్న పొరపాటు ఏకంగా కోర్టు వరకు వెళ్లడం సంచలన గా మారిపోయింది. గేమ్ లో  తన తండ్రి చీటింగ్ చేశాడు అంటూ కూతురు కోర్టు మెట్లెక్కింది.

 ఈ ఆసక్తికర ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమ్ లో తన తండ్రి తనను మోసం చేశాడు అంటూ ఏకంగా కేసు పెట్టి కోర్టును ఆశ్రయించచింది  యువతి. అయితే ఆ గేమ్ ఏదో కాదండీ ప్రస్తుతం ఎంతోమందిని ఆకర్షిస్తున్న లుడో. ప్రస్తుతం లూడో గేమ్ ఎంతో మందిని ఆకర్షిస్తోన్న  విషయం తెలిసిందే. స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు కూడా సరదాగా ఈ గేమ్ ఆడుతూ ఉంటారు. ఇక ఇలా తండ్రి కూతురు గేమ్ ఆడుతున్న తరుణంలో  తండ్రి తనను మోసం చేశాడంటూ కూతురు కోర్టును ఆశ్రయించింది. విచిత్ర ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

 తండ్రీ కూతుళ్లు లో ఆడుతున్న సందర్భంలో... తన తండ్రి తప్పుగా ఆట ఆడి తనను గేమ్ లో  చీటింగ్ చేశాడు అంటూ ఆరోపించింది. తనకు తన తండ్రిపై ఎంతో నమ్మకం ఉందని... అలాంటి ఆయన గేమ్ లో  మోసానికి పాల్పడటాన్ని  తాను జీర్ణించుకోలేక పోయాను అంటూ వాపోయింది సదరు యువతి. సవ్యంగా ఆడుతున్న సమయంలో తన తండ్రి.. చీటింగ్ చేశాడని.. అది జీర్ణించుకోలేక చివరికి కోర్టును ఆశ్రయించినట్లు తెలిపింది. దీనిపై కోర్టు కౌన్సిలర్ మాట్లాడుతూ యువతి కౌన్సిలింగ్ ఇస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు. తన ఆనందం కోసం తండ్రి ఓడిపోతే బాగుంటుందని ఆ యువతి భావించిందని.. కానీ తండ్రి గెలవడంతో కూతురు జీర్ణించుకోలేక ఇలా కోర్టును ఆశ్రయించింది అంటూ కౌన్సిలర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: