నిన్నటి మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ ఎందుకు ఆడలేదో తెలుసా..?
ఇంతలో అందరికీ ప్రశ్న... సన్రైజర్స్ జట్టులో కీలక ఆటగాడైనా విలియమ్సన్ అసలు మ్యాచ్ ఎందుకు ఆడలేదు. దీని వెనుక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా అనే ప్రశ్న కూడా అందరి మదిలో తలెత్తింది. ఎందుకంటే 2018, 2019 సీజన్లలో డేవిడ్ వార్నర్ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ సారధిగా పగ్గాలు చేపట్టిన కేన్ విలియమ్సన్ 2 సీజన్ లలో తన ఆటతో ఆకట్టుకోవడమే కాదు జట్టును ఎంత విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
2018లో సన్రైజర్స్ జట్టు టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో ఓడి రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించాడు కేన్ విలియమ్సన్. కానీ మరోసారి సన్రైజర్స్ యాజమాన్యం డేవిడ్ వార్నర్ పై నమ్మకం ఉంచి కెప్టెన్ గా నియమించింది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లో కేన్ విలియమ్సన్ ఎందుకు ఆడలేదు అనేదానిపై ఇటీవలే ప్రశ్న తలెత్తగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ సెషన్ లో కేన్ విలియమ్సన్ కండరాలు పట్టేయడంతో .. చివరి నిమిషంలో మొదటి మ్యాచ్ కి విలియమ్సన్ దూరం కావాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది ఫ్రాంచైజీ. అతని స్థానంలో వచ్చిన మిచెల్ మార్స్ కి కూడా గాయం అయిన విషయం తెలిసిందే. అతను కూడా వచ్చే మ్యాచ్ నుంచి జట్టుకు దూరమయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.