అలజడి రేపిన ఎన్ కౌంటర్..!

NAGARJUNA NAKKA
ఆసిఫాబాద్ జిల్లా కడంబా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ తెలంగాణలో సంచలనంగా మారింది. ఇద్దరు మవోయిస్ట్‌లను పోలీసులు హతమార్చారు. ఈ ఘటనలో మరికొందరు నక్సలైట్లు తప్పించుకోవడం... అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అటు మహారాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.

కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో జరిగిన ఎదురుకాల్పులు రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తిస్‌గడ్‌కు చెందిన కోయా జంగు.. అలియాస్ వర్గీస్, నిర్మల్ జిల్లా కడెంకు చెందిన కంచి లింగవ్వ ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో 9ఎంఎం పిస్తోలుతో పాటు, మరో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

ఈజ్‌గామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడంబ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసబడ్డారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కడంబా గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో రహాదారిపక్కనే ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేత భాస్కర్ అలియాస్‌ అడెల్లు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. భాస్కర్ కోసం కూంబింగ్ కొనసాగుతోంది.

పోలీసుల విచారణలో భాగంగా 15మంది మావోయిస్టు సానుభూతిపరులను ఆదిలాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉట్నూరు, సిర్పూర్‌, తిర్యాని, అసిఫాబాద్‌కు చెందిన వీరిని పోలీసులు విచారిస్తున్నారు. చనిపోయిన మావోయిస్టుల కిట్‌ బ్యాగుల్లో ఉన్న పేర్ల ఆధారంగా వీరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. వీరి ఆధారంగా మావోయిస్ట్‌ల జాడను తెలుసుకునేందుకసు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.అక్కడ పోలీసులకు నక్సలైట్లకు జరిగిన ఎదురు కాల్పులు ఇపుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారాపాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగడంతో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది.  
అయితే మరికొందరు నక్సలైట్లు తప్పించుకోవడం.. పోలీసులు, అధికార వర్గాల్లో ఆందోళనకు గురిచేస్తోంది. చూడాలి పోలీసుల శ్రమ ఫలితాన్నిస్తుందో లేదో. మావోయిస్టులు లొంగిపోతారో.. లేక ఇలానే ఎదురు దాడులకు దిగుతారేమో.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: