అద్దె కట్టకుండా ఉచితంగా గది.. ఎక్కడంటే..?

praveen
కరోనా  వైరస్ కారణంగా మనిషి జీవితం అతలాకుతలం అయిపోయిన విషయం తెలిసిందే. సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని సంక్షోభం లోకి నెట్టింది కరోనా వైరస్. ఎంతో మంది ఉపాధి కోల్పోయి చివరికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఉంది. ఇక ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ రెంట్ కట్టలేక  తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా చాలామంది. ఇలా ఎంతో మంది జీవితాలను దుర్భరం చేసింది కరోనా వైరస్. ఇలా కరోనా  సమయంలో ఇబ్బందులు పడుతున్న వారికోసం ఇక్కడ ఒక బిల్డర్ కీలక నిర్ణయం తీసుకొని పెద్దమనసు చాటుకున్నాడు. ఏకంగా ఒక పెద్ద బిల్డింగు  వారికోసం ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయించాడు.



 అంతేకాదండోయ్ ఆ పెద్ద బిల్డింగ్ లో ఉండటానికి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా... ఉచితంగా నిరుపేదలకు ఆవాసం కల్పించేందుకు నిర్ణయించాడు ఇక్కడ ఒక బిల్డర్. ఇలా కరోనా  సంక్షోభం సమయంలో పేదలను ఆదుకోవడానికి ముందుకు వచ్చి పెద్దమనసు చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే... సూరత్ కి చెందిన ప్రకాష్ బలాని అనే బిల్డర్ రుద్రాక్ష లేక్ ప్యాలెస్ పేరుతో ఒక బిల్డింగ్ నిర్మించాడు. బిల్డింగ్ ఉమ్రా  లో ఉంది. అయితే ఈ బిల్డింగ్ కట్టి ప్లాట్లు అమ్మాలి అనుకున్నాడు సదరు బిల్డర్.



 కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల  బిల్డింగ్ లో ఉన్న ప్లాట్లు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇక ఇప్పట్లో కస్టమర్లు వస్తారు అన్న నమ్మకం కూడా ఆ బిల్డర్ కి లేదు. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఆ బిల్డింగ్ లోని ఫ్లాట్లను ఖాళీగా ఉంచడం ఎందుకు... ప్రస్తుతం అద్దెలు కట్ట లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ రోడ్డు పాలైన వలస కూలీలు,  ఉద్యోగులకు ఇస్తే కాస్త పుణ్యం అయినా వస్తుంది కదా అని అనుకున్నాడో ఏమో... ఏకంగా 42 ఫ్లాట్ లను వలస కూలీలు ఇతరుల కోసం ఉచితంగా నివాసం ఉండేందుకు అవకాశం కల్పించాడు. ఉపాధి కోసం సూరత్ వచ్చి లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ ప్లాట్లు ఇస్తున్నాను  అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: