అందరినీ ఆదుకునే సోనూసూద్‌కు అపురూపమైన గిఫ్ట్ పంపిన ఫ్యాన్..?

Chakravarthi Kalyan
సోనూ సూద్ ఇప్పుడు భారతదేశంలో ఓ క్రేజ్.. ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తిగా పేరున్న మంచి వ్యక్తి. అందుకే ఆయనకు భాషతో సంబంధం లేకుండా అంతా ఫ్యాన్స్ అవుతున్నారు. ఆయనపై అభిమానం వ్యక్తపరుస్తున్నారు. తాజాగా దీపా జయ అనే అభిమాని ఆయనకు ఓ అపురూపమైన కానుక పంపింది.. అదేంటో తెలుసా... ఆయన పెయింటింగ్.. జీవం ఉట్టిపడేలా ఆయన పెయింటింగ్‌ ను రూపొందించి ఆ వీడియోను సోనూసూద్‌ కు ట్వీట్ చేసింది.

ఈ పెయింటింగ్ వేయడానికి చాలా కష్టపడ్డాను.. గంటల తరబడి కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తోంది. కానీ మా దేవుడిని గౌరవించుకోవడం మా విధి కదా.. వి లవ్ యు సర్ అంటూ కామెంట్ చేసింది దీపా జయ అనే ఆ అభిమాని. ఆ పెయింటింగ్ చూసి ఫిదా అయిన సోనూసూద్ కూడా యూ ఆర్ ద బెస్ట్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు.. ఇలాంటి ప్రశంసలు ఇటీవలి కాలంలో సోనూసూద్‌ కు కోకొల్లలుగా వస్తున్నాయి.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఇంతగా ప్రశంసలు పొందిన వ్యక్తి సోనూసూద్ ఒక్కడే కావచ్చు. ఇటీవల కరోనా కారణంగా దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగాలు గాల్లో కలిసిపోయాయని చెబుతూ ప్రముఖ కార్టూనిస్టు సతీష్ ఆచార్య వేసిన ఓ కార్టూన్ కూడా సోనూసూద్ గొప్పదనాన్ని తెలుపుతోంది. చివరకు మోడీకి వెంటనే సోనూ సూద్‌ గుర్తొచ్చినట్టు ఆ కార్టూన్ ఉంది. అవును మరి సోనూ సేవాభావం అంతగా పాపులర్ అయ్యింది మరి.

ఇప్పుడు అనేక మంది సాయం కోసం సోనూసూద్‌ను సంప్రదిస్తున్నారట. ఆయన ట్విట్టర్‌, మెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అన్నీ.. సాయం కోసం వచ్చే సందేశాలతో నిండిపోతున్నాయట. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా పంచుకున్నాడు. ఒక్కరోజే..1137 మెయిల్స్ 19000 ఫేస్‌బుక్ సందేశాలు 4812 ఇన్‌స్టాగ్రామ్ మెస్సేజులు 6741  ట్విట్టర్ సందేశాలు వచ్చాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: