టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్..?
మామూలుగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రహ్మోత్సవాల కు ప్రతి ఏడు లక్షల్లో భక్తులు హాజరవుతూ ఉంటారు. అయితే సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇక ఈ సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తామని టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. కరోనా వ్యాధి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా స్వామివారి వాహన సేవలు మాడవీధు ల్లో నిర్వహించే పరిస్థితి ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లేదని... అందువల్లే ఎప్పుడూ అంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఈ ఏడు మాత్రం ఏకాంతం గానే ఆలయంలో నిర్వహిస్తామని వెల్లడించారు వై.వి.సుబ్బారెడ్డి. ఏడు అధికమాసం సందర్భంగా ఈ ఏడు రెండు సార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయి అంటూ తెలిపిన ఆయన... ఒక వేళ కరోనా ప్రభావం తగ్గిపోయి పరిస్థితులు అనుకూలిస్తే అక్టోబర్ లో ఎప్పటిలాగే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాము అంటూ చెప్పుకొచ్చారు.