జగన్‌కు గుడ్‌న్యూస్ మీద గుడ్‌న్యూస్.. బాబుకు ఒకటే కడుపు మంట..?

Chakravarthi Kalyan
రాజకీయాల్లోనూ... సినీరంగంలోనూ సెంటిమెంట్లు ఎక్కువ.. ఆ మాటకు వస్తే ఎవరికి మాత్రం సెంటిమెంట్లు ఉండవు చెప్పండి.. ఎవరి స్థాయిలో వారికి సెంటిమెంట్లు ఉంటాయి. ఆ సెంటిమెంట్లకు పెద్దగా లాజిక్ ఉండదు. కానీ ఆ సెంటిమెట్లు మాత్రం బలంగా ఉండిపోతాయి. ఇక విషయానికి వస్తే.. గతంలో చంద్రబాబు కాలంలో.. అంటే.. 1994-2003 కాలంలో ఒకటే కరువు.. వర్షాలు లేవు.. పొలాలు బీళ్లుగా మారాయి. చాలా కష్టకాలం నడిచింది. అందుకే అప్పట్లో గోరటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు పెడుతుందో అన్న పాట బాగా పాపులర్ అయ్యింది.

మొత్తానికి 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాడు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాడు. విచిత్రంగా అప్పటి నుంచి మళ్లీ వర్షాలు ఫుల్లుగా కురిశాయి. అప్పట్లో సాక్షి టీవీలో వైఎస్ నడుస్తుంటే భూమి పచ్చగా మారిపోయినట్టు గ్రాఫిక్స్ చేసి మరీ టెలికాస్ట్ చేశారు. అది కాస్త ఓవర్ అనుకోండి. కానీ.. మొత్తానికి అలాంటి వాతావరణమే కనిపించింది.

కానీ సెంటిమెంట్లకు లాజిక్ ఉండదని చెప్పేందుకు 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూడా వర్షాలు కురవడం ఓ కారణం. ఈసారి చంద్రబాబు కాలంలో కరువు లేదు. వర్షాలు బాగానే పడ్డాయి కూడా. మళ్లీ ఇప్పుడు 2019 జగన్ సీఎం అయ్యాడు. మళ్లీ ఇప్పుడు వర్షాలు జోరుగా పడుతున్నాయి. గతేడాది కూడా ఫుల్లుగా పడ్డాయి. శ్రీశైలం, సాగర్, పులిచింతల ఇలా అన్ని ప్రాజెక్టులు నిండాయి. మళ్లీ ఈ ఏడాది కూడా జలకళ కనిపిస్తోంది.

అందుకే దీనిపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. "జగన్ గారి పాలనపై  ప్రకృతి వరాల జల్లు. వరుసగా రెండో ఏడాది నిండిన నాగార్జున సాగర్, శ్రీశైలం. నిండు కుండల్లా జలాశయాలు - పరవళ్లు తొక్కుతున్న నదీ నదాలు. రాష్ట్రంలో సంతోషాల పంట - చంద్రబాబుకు మాత్రం పెరిగిన కడుపు మంట.” అంటూ కౌంటర్ వేసేశారు. జగన్ ను పొగిడితే పొగిడారు మళ్లీ  చంద్రబాబు ప్రస్తావన ఎందుకు అంటారా.. మరి అలా సెటైర్ వేయకపోతే ఆయన విజయసాయిరెడ్డి ఎందుకు అవుతారు..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: