రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్... ?
గూగుల్ మీట్ యాప్ ద్వారా తాజాగా ఆయాన మీడియాతో మాట్లాడారు. డివిజన్‌లో జరుగుతున్న పలు రైల్వే అభివృద్ధి పనుల గురించి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. 2021 సంవత్సరం నాటికి ఎర్రగుంట్ల -నంద్యాల మధ్య 123 కిలో మీటర్లు, ధర్మవరం-పాకాల మధ్య 227 కిలో మీటర్ల విద్యుద్దీకరణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. గుత్తి-ధర్మవరం మధ్య 30 కి.మీ డబులింగ్ రైలును ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏర్పాటు చేయనున్నామని అన్నారు.
దాదాపు 15 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నల్ వ్యవస్థను గుత్తి యార్డులో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. గుత్తి-రేణుగుంట మధ్యలో 130 కి.మీ వేగంతో నడిచే రైలును మిషన్ రఫ్తార్ లో భాగంగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ రైలు మార్గంలో ట్రాక్ పటిష్టతతో పాటు 23 వంతెనల నాణ్యతను, సిగ్నల్ వ్యవస్థను ఇప్పటికే పరిశీలించామని చెప్పారు.
గుత్తి-వాడీ మధ్య ట్రాక్ ను పటిష్టపరిచే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. గుంతకల్లు రైల్వే డివిజనల్ ఆస్పతిని జిల్లా కలెక్టర్ అనుమతితో ఈ సంవత్సరం చివరినాటికి కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చామని అన్నారు. పరిమిత సంఖ్యలో రైళ్లు నడుపుతూ ఉండటంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్ వరకు రైలు ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగితే ప్రజలు ప్రయాణాల విషయంలో మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.